- 04023454071
- టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదుల వెల్లువ
- నిజామాబాద్ నుంచి 45 కేసులు నమోదు
- హైదరాబాద్‌లో ప్రకటించిన సీబీ డీజీ జనరల్ ఏకేఖాన్
ప్రగతినగర్ : లంచగొండి అధికారులకు చేదు వార్త ! వారి భరతం పట్టడానికి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సచివాలయంలో ఏ ర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 040-23454071కు జిల్లా నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా పింఛన్, ఇండ్ల మంజూ రు, పట్టాపాస్ పుస్తకాలు తయారు తదితర వాటిపై అధికారులు లంచం ఆశిస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్తున్నాయి. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన స్వల్ప వ్వవధిలోనే వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్ హైదరాబాద్‌లో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా 499 కేసులు నమోదు కాగా నిజామాబాద్ నుంచి 45 కేసులు నమోదు చేసినట్లు ఎకే ఖాన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.