సహకార సంఘ సభ్యులకు(రైతులకు) మెరుగైన సేవలందించేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) టోల్‌ప్రీ నంబర్ 1800 425 0665ను అందుబాటులోకి తెచ్చింది.
తాండూరు, న్యూస్‌లైన్: సహకార సంఘ సభ్యులకు(రైతులకు) మెరుగైన సేవలందించేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) టోల్‌ప్రీ నంబర్ 1800 425 0665ను అందుబాటులోకి తెచ్చింది. శనివారం నుంచి 24 గంటలూ ఈ నంబర్ ద్వారా రైతులకు సేవ లు అందుతాయి. జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల రైతులు ఈ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకో వచ్చు. ఎంత ఎరువు అవసరం.. సాగు చేసిన పంట.. ఎంత రుణ సాయం కావాలి.. ఎప్పుడు రుణం ఇస్తారు.. తిరిగి ఎప్పుడు చెల్లించాలి.. వంటి వివరాలు తెలుసుకో వచ్చు.
రైతులు ఇచ్చే సమాచారం ఆధారంగా డీసీసీబీ చర్యలు చేపట్టనున్నది. సహకార బ్యాంకు నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపైనా సమాచారం ఇవ్వొచ్చు. రైతుల నుంచి టోల్‌ప్రీ నంబర్‌కు వచ్చిన వివరాల ఆధారంగా ఆయా సహకార సంఘాల పరిధిలో ఎంత మేర కు రుణాలు, ఎరువులు, విత్తనాలు అవసరమో ముందస్తుగానే డీసీసీబీ అంచనా వేయనుంది. రైతుల కు రుణాలు, ఎరువుల పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతోనే టోల్ ప్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామని శుక్రవారం తాండూరులో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి తెలిపారు.