అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న కలెక్టర్ | collector is too strict | Sakshi
Sakshi News home page

అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న కలెక్టర్

Published Tue, Oct 1 2013 2:23 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

జిల్లా పాలనను గాడిలో పెట్టడానికి కలెక్టర్ ప్రద్యుమ్న కృషి చేస్తున్నారు. ఆర్భాటాలకు తావివ్వకుండా తన పని తాను చేసుకుపోతున్నా రు. జిల్లాకు రావడంతోనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
 జిల్లా పాలనను గాడిలో పెట్టడానికి కలెక్టర్ ప్రద్యుమ్న కృషి చేస్తున్నారు. ఆర్భాటాలకు తావివ్వకుండా తన పని తాను చేసుకుపోతున్నా రు. జిల్లాకు రావడంతోనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. స్థానిక అధికారుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలుంటే నేరుగా తన ఫోన్ నంబర్ (9491036933)కు సమాచారం ఇవ్వాలని సూచించారు. తర్వాత కలెక్టరేట్‌లో 1800 425 6644 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ప్రజావాణిపైనా దృష్టి సా రించారు. ఫిర్యాదు చేసిన 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశిం చారు. వాటికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని సూచించారు. ప్రజావాణితో పాటు, తన ఫోన్‌కు, టోల్‌ఫ్రీ నెంబర్లకు వ చ్చిన ఫిర్యాదులను బ్లాక్‌లవారీగా విభజిస్తున్నారు. ప్రజావాణి ఫిర్యాదులను ‘ఎ’ బ్లాకు లో, కలెక్టర్ సెల్ నంబర్ ఫిర్యాదులను ‘బి’ బ్లాకుగాను, టోల్‌ఫ్రీ నెంబర్‌కు వచ్చే ఫిర్యా దులను ‘సి’ బ్లాకుగా విభజించి నమోదు చేస్తున్నారు. తర్వాత సమస్యను సంబంధిత శాఖకు పంపిస్తున్నారు. వారు పక్షంలోగా పరిష్కరిం చాల్సి ఉంటుంది. ఒకవేళ పరిష్కరించకపోతే కారణాలను వివరించాలి.
 
 సమీక్షలతో హడలెత్తిస్తూ..
 కలెక్టర్ ఆయా శాఖల ప్రగతిపై సమీక్షలు నిర్వహిస్తూ హడలెత్తిస్తున్నారు. మంగళవారం నుం చి శుక్రవారం వరకు సమీక్షలు సాగుతున్నా యి. ఒక్కోసారి ఉదయం ప్రారంభమయ్యే సమావేశం రాత్రి పొద్దుపోయే వరకూ సాగుతోంది. శాఖ పనితీరు, వారికి ఇచ్చిన లక్ష్యం, ప్రస్తుత పరిస్థితి, పథకాల ప్రగతి తదితర అం శాలపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. సరిగా స్పందించని వారికి క్లాస్‌లు తీసుకుంటున్నారు. దీనిని భరించలేని కొందరు సెలవులో వెళ్లారు. ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, సం క్షేమ శాఖలు, ఇరిగేషన్, డ్వామా, డీఆర్‌డీఏ, విద్యాశాఖ, ఆర్‌వీఎం లాంటి ప్రధాన శాఖలపై కలెక్టర్ సమీక్షలు నిర్వహించారు.
 
 ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్..
 పాలనలో పారదర్శకత కోసం కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. తాను జిల్లాలోని ఏ శాఖ అధికారికి ఫైల్ పంపించినా.. 24గంటల్లో పూర్తి వివరాలతో దానిని తిరిగి తన వద్దకు పంపాలని సర్క్యూలర్ జారీ చేశారు. దీనికి సంబంధించి ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు, దరఖాస్తుల పరిశీలన, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాల ప్రగతి దీని ద్వారా ఇట్టే తెలి సిపోతుంది.
 
 ‘వీకెండ్’కు స్వస్తి..
 జిల్లా కలెక్టర్‌గా వరప్రసాద్ ఉన్నప్పుడు వా రాంతపు సమీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాస్థాయి అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు సమావేశంలో పాల్గొనేవారు. వారంలో ఆయా శాఖలు సాధించిన ప్ర గతిపై సమీక్షించేవారు. సమీక్ష పేరుతో శని వారం ఆయా అధికారులు తమ స్థానాల్లో అం దుబాటులో ఉండేవారు కాదు. దీంతో అప్ప ట్లో ఈ సమావేశంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కలెక్టర్‌గా వచ్చిన క్రిస్టీనా కూడా వారాంతపు సమీక్షలు కొనసాగించారు. అయి తే మండల స్థాయి అధికారులు మధ్యాహ్నం వరకు కచ్చితంగా తమ కేంద్రాల్లో విధులు ని ర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు. కొత్త కలెక్టర్ ప్రద్యుమ్న వారాంతపు సమీక్షలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. వారంలో ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నందున ప్రత్యేకంగా వారాంతపు సమీక్ష నిర్వహించడం దం డుగని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడుతూ శాఖల పని తీరు ను తెలుసుకుంటున్నారు.
 
 ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు హాస్టళ్లలో బస చేసి, సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతిని ధులు, సంఘాల నాయకులు, పైరవీకారులకు దూరంగా ఉంటూ కలెక్టర్ తన పని తాను చే సుకుపోతున్నారు. ఇలా జిల్లా పాలనపై ప్రత్యే క ముద్ర వేయడానికి ఆయన చర్యలు తీసు కుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement