పేటీఎం కస్టమర్లకు శుభవార్త | You no longer need internet data to use Paytm | Sakshi
Sakshi News home page

పేటీఎం కస్టమర్లకు శుభవార్త

Published Wed, Dec 7 2016 1:39 PM | Last Updated on Tue, Aug 28 2018 5:18 PM

పేటీఎం కస్టమర్లకు శుభవార్త - Sakshi

పేటీఎం కస్టమర్లకు శుభవార్త

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ వ్యాలెట్‌ సంస్థ పేటీఎం వినియోగదారులకు శుభవార్త. మరో సరికొత్త వెసులు బాటుతో పేటీఎం సిద్ధమైంది. టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంటేనే ఈ వ్యాలెట్‌ ద్వారా రీ చార్జీలు, నగదు బదిలీలు, చెల్లింపులకు అవకాశం ఉండగా ఇక నుంచి ఇంటర్నెట్‌ సౌకర్యం లేకుండా కూడా దాని ద్వారా లావాదేవీలు జరుపుకునే వీలును తీసుకొచ్చింది. స్మార్ట్‌ ఫోన్‌ అవసరం లేకుండానే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

180018001234 అనే టోల్‌ ఫ్రీ నంబర్‌కు డయల్‌ చేయడం ద్వారా అందులో ఇచ్చే సూచనలు పాటిస్తూ ఎలాంటి లావాదేవీలైన జరుపుకునే అవకాశం ఉంది. ఇందుకోసం కస్టమర్లు, వ్యాపార వేత్తలు తొలుత మొబైల్‌ ద్వారా పేటీఎంలో రిజిస్టర్‌ కావాలి. నాలుగు అంకెల పిన్‌ ఎంటర్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నామో వారి మొబైల్‌ నెంబర్‌ కోసం ఆప్షన్‌, ఎంత నగదు పంపించాలో అనే ఆప్షన్‌ వస్తుంది. ఆ తర్వాత పంపించేవారి పేటీఎం పిన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయడం ద్వారా ఈ పని పూర్తవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement