
సాక్షి, అమరావతి: రైల్వే ప్రయాణికులు 139 టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవాలని రైల్వే సలహా కమిటీ సూచించింది. రైల్వే పోలీసుల ప్రవర్తనపై సలహా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. విశాఖపట్నంలో జరిగిన సమావేశం వివరాలను ఈస్ట్ కోస్ట్ రైల్వే అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్(ఆర్‌పీఎఫ్) సంజయ్ వర్మ మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు. రైల్వే ప్రయాణికులకు అవసరమైన సమాచారం, ఫిర్యాదులు, సహకారం కోసం 139 ఉపయోగపడుతుందన్నారు.
ఈ టోల్ ఫ్రీ నంబర్‌పై పెద్ద ఎత్తున ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రైల్వే పోలీసుల పనితీరుపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, వారి పనితీరుపై అభినందనలు కూడా వచ్చాయని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి సమస్య, ఇబ్బందులు వచ్చినా ప్రతి రైలులోను ఉండే ఆర్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment