- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ
తిరుపతి రూరల్
దళిత, గిరిజనులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో వనం-మనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. అంతకు ముందు తిరుపతి అంబేద్కర్ భవన్‌లో ఆయన్ని దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్షత కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సైతం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం కొనసాగుతునే ఉందని విమర్శించారు. కేవలం కొన్ని సామాజిక వర్గాల వారినే ఫోకల్ పాయింట్లలో పోస్టింగ్‌లు దక్కుతున్నాయని పేర్కొన్నారు. అందుకే అందరికి అందుబాటులో సత్వర న్యాయం ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం మెరుగైన చర్యలను చేపడుతుందని కొనియాడారు.
దళిత, గిరిజనుల కోసం టోల్ ఫ్రీ నంబర్
Published Wed, Aug 10 2016 7:37 PM | Last Updated on Tue, Aug 28 2018 5:18 PM
Advertisement