
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డిలో తల్లీ కుమారులు గంగం పద్మ, గంగం సంతోష్‌లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దోషులకు శిక్షపడేలా చూస్తామని బాధిత కుటుంబానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ నిచ్చారు. రామాయంపేటకు చెందిన బాధిత కుటుంబానికి ఆదివారం ఆయన ఫోన్ చేసి పరా మర్శించారు.
సంతోష్ తండ్రి అంజయ్య, సోదరు డు శ్రీధర్‌లతో మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఫోన్‌లో మాట్లాడించారని, ఈ సందర్భంగా పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని రేవంత్‌రెడ్డి వారికి చెప్పినట్టు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. టీఆర్‌ఎస్ నేతల ఆగడాలు మితిమీరి పోయాయని, ఇంకా చాలా మంది తమలాంటి బాధితులున్నారని సంతోష్ కుటుంబసభ్యులు రేవంత్‌కు వివరించారని చెప్పాయి.
Comments
Please login to add a commentAdd a comment