
ప్రతీకాత్మక చిత్రం
తమిళనాడు, టీ.నగర్ : నిశ్చితార్థం రోజున వరుడి ప్రియురాలినని ఓ యువతి ఫోన్‌లో మాట్లాడడంతో వధువు కుటుంబీకుల మధ్య కలకలం రేగింది. ఈ వివరాలు ఆదివారం వెల్లడయ్యాయి. చెన్నై విరుగంబాక్కం రామాపురానికి చెందిన మహిళ (23)కు కడలూరు, కురింజి పట్టు పెన్నాగరం ప్రాంతానికి చెందిన వసంత కుమార్‌ను ఇష్టపడడంతో ఇరు కుటుంబీకుల సమ్మతంతో ఈ నెల ఒకటో తేదీన నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో వధువు ఇంటి వారికి ఒక ఫోన్‌కాల్ అందింది.
అందులో మాట్లాడిన వ్యక్తి తన పేరు విజిలా అని, తాను వసంతకుమార్ ప్రియురాలినని, తాను ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది. దిగ్భ్రాంతి చెందిన వధువు ఇంటి వారు వరుడు కుటుంబీకులతో వాగ్వాదానికి దిగారు. చివరకు వరుడు ఇంటి వారు దీన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. నిశ్చితార్థం నిలిచిపోవడంతో దీనిపై రాయల్‌నగర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో విజిలాకు ఇది వరకే వివాహం అయినట్లు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment