ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ మాట్లాడుకున్నారనే వార్త దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కమలా హారీస్ కార్యాలయం స్పందించింది. కమలా హారీస్‌తో రాహుల్ మాట్లాడలేదని స్పష్టం చేసింది. ఇదంతా ఫేక్ అని కొట్టిపారేసింది.
కాగా, కమలా హారీస్‌తో రాహుల్ గాంధీ ఫోన్‌లో మాట్లారనే వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో కమలా హారీస్ కార్యాలయం శనివారం స్పందించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా..‘కమలా హారీస్‌తో రాహుల్ మాట్లాడలేదు. ఇదంతా ఫేక్ ప్రచారం మాత్రమే’ అని ఖండించింది. దీంతో, రాజకీయ దుమారానికి తెరపడినట్టు అయ్యింది. అయితే, అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌తో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారనే వార్త రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
Moye moye ho gya ye to
The US Vice President's office has denied reports of a phone conversation between Kamala Harris and Indian politician Rahul Gandhi, contradicting earlier claims made by some media outlets and social media posts. This has led to accusations of spreading… pic.twitter.com/8vz3eV09vY— Manisha Singh (@ManiYogini) July 13, 2024
ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీ మధ్య దౌత్యపరంగా, రాజకీయంగా మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. పలుమార్లు మోదీకి అనుకూలంగానే బైడెన్ మాట్లాడారు. ఇక, మోదీ రష్యా పర్యటన సందర్భంగా కూడా అమెరికా.. భారత్, మోదీకి అనుకూలంగానే కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment