
ఫిల్మ్ నగర్‌లో సివసించే ఆయనకు చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు జగపతి బాబు సోదరుడి యుగేంద్ర కుమార్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఫిల్మ్ నగర్‌లో సివసించే ఆయనకు చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావడంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గుట్టల బేగంపేట స్థలం విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు అతని కుమారుడిని చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు చెప్పారు. దీని వెనుక బంజారాహిల్స్ ఎమ్మెల్యేకాలనీకి చెందిన రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.