‘సీఎం పళనిస్వామిని చంపేస్తా’ | killing the cm palani swamy | Sakshi

‘సీఎం పళనిస్వామిని చంపేస్తా’

Apr 29 2019 3:49 AM | Updated on Jul 29 2019 5:43 PM

killing the cm palani swamy - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని చంపేస్తామని వచ్చిన ఓ ఫోన్‌కాల్‌ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. చెన్నై ఎగ్మూర్‌లోని కంట్రోల్‌ రూమ్‌కు శనివారం రాత్రి ఓ యువకుడు ఫోన్‌ చేశాడు. ‘నా పేరు గురుశంకర్‌. కొడైకెనాల్‌ బస్టాండ్‌ వద్ద సీఎం పళనిస్వామిని హతమారుస్తా. ఇదే నా సవాల్‌’ అని కాల్‌ కట్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీస్‌వర్గాల్లో కలకలం చెలరేగింది. ఉన్నతాధికారులు సీఎం నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.  విచారణ ప్రారంభించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తమకు ఫోన్‌చేసిన వ్యక్తిని దిండుగల్‌ జిల్లా విరాళి పట్టికి చెందిన గురుమూర్తిగా(25)గా గుర్తించారు.  గురుశంకర్‌ తండ్రి రామమూర్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కొడైకెనాల్‌లో గాలింపు ముమ్మరం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement