tamilnadu cm Palani Swamy
-
చిదంబరంపై విరుచుకుపడ్డ తమిళనాడు సీఎం
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన చిదంబరం భూమికి భారమే తప్ప ఆయన వల్ల దేశానికి ఒరిగేదీమీ లేదంటూ అనుచిత వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు. కావేరి నది నీటి వివాదం సహా తమ రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యలను చిదంబరం పరిష్కరించలేదని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్లో చేసినట్లుగానే తమిళనాడును కేంద్ర భూభాగంగా మార్చాలని కేంద్రం నిర్ణయించినట్లయితే, అధికార ఏఐఎడీఎంకె దాన్ని వ్యతిరేకించదా అన్న చిదంబరం విమర్శలకు పత్రిగా పళనిస్వామి ఇలా స్పందించారు. చిదంబరం ఎన్నేళ్లు కేంద్రమంత్రిగా ఉంటే ఏం లాభం? ఆయన ఏయే పథకాలు తీసుకొచ్చారు (ప్రధానంగా తమిళనాడుకు)? దేశానికి ఆయన వల్ల ఏం ఉపయోగం.. భూమిపై భారం తప్ప అని ముఖ్యమంత్రి పళనిస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా ఆర్టికల్ 370, 35-ఏ రద్దు, జమ్మూ కశ్మీర్ విభజనపై కేంద్రంపై చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో హిందువుల శాతం అధికంగా ఉంటే ఆర్టికల్ 370ని రద్దు చేసేవారా అని బీజేపీని ప్రశ్నించారు. ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఆర్టికల్ రద్దుకు కాంగ్రెస్ పార్టీ మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తోందటూ ఈ విమర్శలను బీజేపీ తిప్పి కొట్టింది. -
‘సీఎం పళనిస్వామిని చంపేస్తా’
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని చంపేస్తామని వచ్చిన ఓ ఫోన్‌కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. చెన్నై ఎగ్మూర్‌లోని కంట్రోల్ రూమ్‌కు శనివారం రాత్రి ఓ యువకుడు ఫోన్ చేశాడు. ‘నా పేరు గురుశంకర్. కొడైకెనాల్ బస్టాండ్ వద్ద సీఎం పళనిస్వామిని హతమారుస్తా. ఇదే నా సవాల్’ అని కాల్ కట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీస్‌వర్గాల్లో కలకలం చెలరేగింది. ఉన్నతాధికారులు సీఎం నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విచారణ ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు తమకు ఫోన్‌చేసిన వ్యక్తిని దిండుగల్ జిల్లా విరాళి పట్టికి చెందిన గురుమూర్తిగా(25)గా గుర్తించారు. గురుశంకర్ తండ్రి రామమూర్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కొడైకెనాల్లో గాలింపు ముమ్మరం చేశారు. -
ఎమ్మెల్యేల అనర్హతపై భిన్నాభిప్రాయం
చెన్నై: తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనం లభించింది. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధిస్తూ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ సమర్థించగా.. మరోజడ్జి జస్టిస్ ఎం.సుందర్ వ్యతిరేకించారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో తుది తీర్పు కోసం ఈ కేసు విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేశారు. ఈ కేసును ఎవరు విచారించాలో ప్రధాన న్యాయమూర్తి తర్వాతి సీనియర్ న్యాయమూర్తి నిర్ణయిస్తారని చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ తెలిపారు. మూడో జడ్జి తీర్పు వెలువరించేంత వరకు యథాతథస్థితి అంటే 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కొనసాగుతుందన్నారు. జయలలిత మరణంతో అనిశ్చితి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో తమిళనాట రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. సీఎం పదవి నుంచి పన్నీర్ సెల్వంను తప్పించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని జయలలిత నెచ్చెలి శశికళ భావించారు. దీన్ని పన్నీర్ సెల్వం వ్యతిరేకించారు. దీంతో అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మరోవైపు అనూహ్యంగా శశికళ జైలుకెళ్లడంతో సీఎం పగ్గాలను పళనిస్వామికి అప్పగించారు. శశికళ సోదరి కుమారుడు దినకరన్ కూడా పళనిస్వామికి మద్దతిచ్చారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలసిపోయి శశికళ, దినకరన్‌లను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా, పన్నీర్ సెల్వం ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పన్నీర్‌తో చేతులు కలపడాన్ని వ్యతిరేకించిన దినకరన్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి పళనిస్వామికి ఎదురుతిరిగారు. దీంతో ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద ఆ 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ గత సెప్టెంబర్ 18న అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అనర్హత రద్దై ఉంటే ప్రభుత్వానికి ముప్పే ప్రస్తుతానికైతే హైకోర్టు తీర్పు పళనిస్వామి ప్రభుత్వానికి ఊరటనిచ్చినట్టేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే 18 మంది అనర్హులైనందున ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని ప్రతిపక్ష డీఎంకే ఆరోపిస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు రద్దై ఉండి ఉంటే పళని ప్రభుత్వానికి చాలా చిక్కులు వచ్చేవి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు స్పీకర్ మినహా అధికార పార్టీ అన్నాడీఎంకేకు 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడగా.. ప్రతిపక్ష డీఎంకే పార్టీకి 89 మంది, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌కు 8 మంది, ఐయూఎంల్‌కు ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. దినకరన్ స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ మధ్యే మరో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో దినకరన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 22 అయింది. వీరు డీఎంకే, కాంగ్రెస్ కూటమికున్న 98 ఎమ్మెల్యేలతో కలిస్తే వీరి బలం 120గా మారేది. అప్పుడు అధికార పార్టీ బలం స్పీకర్‌తో కలిపి 114గా ఉండేది. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయేది. హైకోర్టు తీర్పుపై దినకరన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వ కొనసాగింపునకు వీలు కల్పిస్తోందని వ్యాఖ్యానించారు. -
ఆగ్రహంతో రగిలిపోతున్న శశికళ!
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ భవిష్యత్తు ఏమిటో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. శశికళ ఎంపిక చెల్లదంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చేసిన ఫిర్యాదుపై ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఈనెల 20వ తేదీన తీర్పు చెప్పనున్నట్లు విశ్వసనీయ సమాచారం. శశికళ పదవి ఉండేనా ఊడేనా అనే చర్చతో అన్నాడీఎంకేలోని ఇరువర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఆ తరువాత పన్నీర్‌సెల్వం, శశికళ మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో పార్టీ రెండుగా చీలిపోయింది. చీలిక వర్గానికి సారథ్యం వహిస్తున్న పన్నీర్‌సెల్వం తన వర్గ ఎంపీల ద్వారా శశికళ ఎంపికపై సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఐదేళ్ల పాటు నిరంతరాయంగా సభ్యత్వంలేని శశికళ ప్రధాన కార్యదర్శి పదవికి అర్హురాలు కాదని పన్నీర్‌వర్గం వాదించింది. దీంతో ఆమెను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామని శశికళ వర్గీయులు సమర్థించుకున్నారు. పార్టీలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అనే విధానమే లేదు, పార్టీ నియమావళిని సవరించే హక్కు ఎవరికీ లేదని పన్నీర్ వర్గం వాదించింది. ఇదే వాదనను సీఈసీ ముందుంచి శశికళను అనర్హురాలిగా ప్రకటించాలని ఫిర్యాదు చేసింది. పన్నీర్ ఇచ్చిన ఫిర్యాదుకు బదులివ్వాల్సిందిగా సీఈసీ శశికళకు నోటీసులు జారీచేసింది. అయితే శశికళకు బదులుగా ఆమె అక్క కుమారుడు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బదులిచ్చారు. దినకరన్ ఇచ్చిన వివరణను స్వీకరించేందుకు నిరాకరించిన సీఈసీ శశికళ నుంచి జవాబును రాబట్టింది. శశికళ ఇచ్చిన జవాబుపై పన్నీర్‌సెల్వం మరోసారి సీఈసీకి వివరణ ఇచ్చారు. పన్నీర్‌సెల్వం వివరణను శశికళ మరోసారి ఖండిస్తూ సీఈసీకి లేఖ రాసింది. ఇలా సీఈసీ కేంద్రంగా ఇరు వర్గాల మధ్య సుమారు నెలరోజులపాటు ఉత్తరాల పరంపర సాగి రెండు రోజుల క్రితం ముగిసింది. 24లోగా తీర్పు: ఇరుపక్షాల వాదనలపై సీఈసీ అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఆర్కేనగర్లో ఉప ఎన్నికలు జరుగుతుండగా అభ్యర్థులకు ఈనెల 24వ తేదీలోగా బీఫారం అందజేయాల్సి ఉంటుంది. బీఫారం అందజేసిన వారికి ఎన్నికల కమిషన్ ఎన్నికల చిహ్నాన్ని కేటాయిస్తుంది. అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నం రెండాకులు తమదేనంటూ శశికళ, పన్నీర్‌వర్గాలు వాదించుకుంటున్నాయి. అర్కేనగర్ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి అత్యవసర పరిస్థితులు నెలకొని ఉన్నందున ఈనెల 20వ తేదీన సీఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం వర్గీయుడైన పార్లమెంటు సభ్యుడు మైత్రేయన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, శశికళను అనర్హురాలిగా ప్రకటించడం, రెండాకుల చిహ్నం తమకు దక్కడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బలమైన ఆధారాలతో కూడిన వినతిపత్రాన్ని సీఈసీకి అందజేసినందున తమకే దక్కుతుందని విశ్వాసం ఉన్నట్లు చెప్పారు. పార్టీలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి విధానమే లేనపుడు శశికళ ఎంపిక ఎలా చెల్లుతుందని ఆయన అన్నారు. శశికళ ఎంపిక చెల్లదని సీఈసీ ప్రకటించగానే ఆమె చేసిన నియామకాలు రద్దు కాగలవు, పార్టీ తమ చేతుల్లోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అగ్రహార జైలులో శశికళ ఆగ్రహం: బెంగళూరులోని అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళ ఆగ్రహంతో రగలిపోతున్నట్లు సమాచారం. ఆస్తుల కేసులో శశికళ జైలు జీవితానికి నెలరోజులు పూర్తయ్యాయి. జైలుకు వెళ్లిన తొలి దినాల్లో పరామర్శకు వచ్చిన నేతలు క్రమేణా కనుమరుగయ్యారని ఆమె కోపంతో ఉన్నారు. నెలరోజుల్లో మంత్రులు సెంగొట్టయ్యన్, దిండుగల్లు శ్రీనివాసన్, సెల్లూరు రాజా, ఆర్ కామరాజ్ శశికళను చూసి వచ్చారు. ఆ తరువాత మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ బెంగళూరులో కలిశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎడపాడి పళనిస్వామి, కొందరు మంత్రులు బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే విశ్వాసపరీక్షలో నెగ్గిన తరువాత రావాల్సిందిగా చిన్నమ్మ ఆదేశించడంతో ఆగిపోయారు. అయితే విశ్వాసపరీక్షలో నెగ్గిన తరువాత సీఎం ఎడపాడి చిన్నమ్మను మరిచిపోయారు. ఇప్పటి వరకు బెంగళూరు వెళ్లకపోవడం శశికళ ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. సీఎం మాత్రమే కాదు కొన్ని రోజులుగా ఎవ్వరూ తనను చూసేందుకు రాకపోవడంపై శశికళ ఆసంతృప్తితో రగిలిపోతున్నారు.