
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా బైడెన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు నేతలు పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు లక్ష్యంగా ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, వాతావరణ మార్పుపై పోరులో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ‘ప్రెసిడెంట్ బైడెన్, నేను న్యాయబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాం’ అని మోదీ ట్వీట్ చేశారు.