
సాక్షి, పెద్దపల్లి: ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేల రాజీనామాలతో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల కారణంగా ప్రభుత్వం ఆ నియోజకవర్గాలకు భారీ మొత్తంలో ఫండ్స్ రిలీజ్ చేయడం, అభివృద్ధి పనులు చేపట్టడం చేయడం జరిగింది. దీంతో, ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ప్రజలతో చేదు అనుభవం ఎదురైంది. కొందరు తమ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తాజాగా అలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి నియోజకవర్గానికి చెందిన రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మునుగోడులో టీఆర్‌ఎస్ గెలుస్తుందా? అని ప్రశ్నించాడు. దీనికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. తనకు తెలియదు అని సమాధానం ఇవ్వడంతో.. పెద్దపల్లి అభివృద్ధి కావాలంటే మీరు కూడా రాజీనామా చేస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. దీనికి ఎమ్మెల్యే సమాధానం ఇస్తూ.. మంచిది.. నువ్వు ఇక్కడకు వచ్చి మాట్లాడు.. అన్నారు. కాగా, వీరిద్దరూ మాట్లాడిన వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment