CM Jagan Review Of Prestigious Conference Arrangements In Visakhapatnam - Sakshi
Sakshi News home page

విశాఖలో ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లపై సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు

Published Thu, Jan 12 2023 2:40 PM | Last Updated on Thu, Jan 12 2023 5:18 PM

CM Jagan Review of Prestigious conference arrangements in Vizag - Sakshi

సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నంలో త్వరలో జరగనున్న జీ-20 వర్కింగ్‌ గ్రూపు సన్నాహక సమావేశం, గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌-2023 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

మార్చి 3–4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్లపై సీఎం సమీక్ష
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సదస్సు
2014–2019 మధ్య రూ. 18.87 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకుంటే వాస్తవానికి ఆ మధ్యకాలంలో గ్రౌండ్‌ అయిన పెట్టుబడుల్లో ఏడాదికి సగటున రూ.11,994 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్న అధికారులు.
2019–2022 మధ్య గ్రౌండ్‌ అయిన పెట్టుబడుల్లో సగటున ఏడాదికి పెట్టుబడులు రూ. 15,693 కోట్లు వచ్చాయని వెల్లడి.
2019 నుంచి ఇప్పటివరకూ ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రతిపాదనలు రూ.1,81,821 కోట్లు కాగా, ఈ పెట్టుబడులన్నీ వేర్వేరు దశల్లో పురోగతిలో ఉన్నాయని, వీటి ద్వారా 1,40,903 మందికి ఉద్యోగ కల్పన జరుగుతోందన్న అధికారులు

వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలన్న సీఎం.
రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించాలన్న సీఎం.
కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదిక కావాలన్న సీఎం.
దీనికి గ్లోబల్‌  ఇన్వెస్టర్స్‌ సదస్సు ఊతం ఇవ్వాలన్న సీఎం.
గ్లోబల్‌  ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా వివిధ దేశాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తామన్న అధికారులు.
విదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడున్న పారిశ్రామిక వాడలను పరిశీలించాలన్న సీఎం. వాటి నిర్వహణపై అవగాహన పెంచుకోవాలన్న సీఎం.
అలాగే ఆ దేశాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్న తీరుపై అధ్యయనం చేయాలన్న సీఎం.
వాటి నిర్వహణా పద్ధతులను మన రాష్ట్రంలో అవలంభించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం.

విశాఖపట్నంలో జి–20 సన్నాహక సదస్సు కోసం ఏర్పాట్లు తదితర అంశాలపైనా సీఎం సమీక్ష
ప్రపంచదేశాల నుంచి హాజరు కానున్న 250 మంది ప్రతినిధులు.
ఒక్కొక్క జీ–20 సభ్యదేశం నుంచి 6గురు చొప్పున హాజరు.
అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున హాజరు.
కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు హాజరు.
 మార్చి 28–29 మధ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు సమావేశం.

సమావేశం కోసం విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం.
అవసరమైన రోడ్లు, సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్న సీఎం.
ప్రధాన జంక్షన్లు, బీచ్‌ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలన్న సీఎం.
ఒక్క ఈ సమావేశం సందర్భంగానే కాదు, అన్ని రోజుల్లోనూ ఇవి ఇలాగే ఉండేలా తగిన కార్యాచరణ చేయాలన్న సీఎం.
ఆతిథ్యం, రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్న సీఎం.
ఏర్పాట్లుకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలన్న సీఎం.
ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్టు తెలిపిన అధికారులు.
ప్రతినిధులు పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు బాగా ఉండేలా చూసుకోవాలన్న సీఎం.
ఆయా పర్యాటక ప్రదేశాల వద్ద ఆహ్లాదకర పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
పెట్టబడులకు ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉండాలన్న సీఎం.

ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి(గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రవాణాశాఖమంత్రి పినిపే విశ్వరూప్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), బీసీ సంక్షేమం, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, పర్యాటక,  సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌భార్గవ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐ అండ్ పీఆర్ కమిషనర్‌ టి విజయ్‌కుమార్‌ రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ సృజన, ఇతర ఉన్నతాధికారులతో పాటు  విశాఖ జిల్లా అధికారులు హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement