బ్రెజిల్‌ అధ్యక్షుడి తలకు గాయం.. రష్యా పర్యటన రద్దు | Brazil President Injures Head over Falling In Bathroom | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌ అధ్యక్షుడి తలకు గాయం.. రష్యా పర్యటన రద్దు

Oct 21 2024 8:42 AM | Updated on Oct 21 2024 11:26 AM

Brazil President Injures Head over Falling In Bathroom

బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనాల్సిన ఆయన బాత్‌రూంలో జారిపడిపోవటంతో తలకు గాయం అయింది.  తలకు రక్తస్రావం కారణంగా సుదూర విమానాలను తాత్కాలికంగా నివారించాలని వైద్య సలహా ఇచ్చారు. ఈ మేరకు ఆయన బ్రిక్స్‌ సమావేశాలు జరిగినే రష్యా పర్యటను రద్దు చేసుకున్నారు. 

అయితే.. ఆయన కాన్ఫరెన్స్ ద్వారా బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటారని బ్రెజిల్‌ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రష్యాకు ఆయన బయలుదేరాల్సింది.

 

లూయిజ్‌ డాక్టర్‌ రాబర్టో కలీల్  మీడియాతో మాట్లాడారు. ‘‘అధ్యక్షుడు లూయిజ్‌ బాత్రూంలో జారీపడిపోయారు. దీంతో ఆయన తల వెనుక భాగంలో  గాయం అయింది. గాయానికి కుట్లు వేయవలసి వచ్చింది.  తలకు రక్తస్రావం అయింది. వారం రోజులు పాటు చికిత్స అందిస్తూ.. పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి’’ అని చెప్పారు. 

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని అన్నారు. మరోవైపు.. బ్రిక్స్ సదస్సులో బ్రెజిల్ ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి మౌరో వియెరా నేతృత్వం వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement