‘‘మోదీ కా పరివార్‌ తొలగించండి’’ | Modi Requested To Remove Modi Ka Parivar | Sakshi
Sakshi News home page

‘‘మోదీ కా పరివార్‌ తొలగించండి’’.. మోదీ విజ్ఞప్తి

Published Tue, Jun 11 2024 9:55 PM | Last Updated on Tue, Jun 11 2024 9:59 PM

Modi Requested To Remove Modi Ka Parivar

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో పేర్ల వెనుకాల ఉన్న ‘మోదీ కా పరివార్‌’ను తొలగించాల్సిందిగా ప్రధాని మోదీ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా మంగళవారం(జూన్‌11) విజ్ఞప్తి చేశారు.‘ఎన్నికల సమయంలో నా మీద అభిమానానికి గుర్తుగా సోషల్‌ మీడియా ఖాతాల్లో మోదీ కా పరివార్‌ చేర్చారు. ఇది నాకు చాలా శక్తినిచ్చింది. 

ఈ శక్తితోనే వరుసగా మూడోసారి  ఎన్డీఏ విజయం సాధించింది. మనమంతా ఒకే కుటుంబం అనే సందేశాన్ని చాటిచెప్పినందుకు ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు. ఇప్పుడు ఆ నినాదాన్ని తొలగించండి.  ఇది లేకున్నా కుటుంబంగా మన  బంధం మాత్రం చెక్కు చెదరదు’అని మోదీ ట్వీట్‌లో తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement