
గాంధీనగర్: వడోదరా కారు ప్రమాదం కేసులో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడు రక్షిత్ చౌరాసియా తానేం మద్యం సేవించి బండి నడపలేదంటూ మొదటి నుంచి వాదిస్తున్నాడు. అయితే.. తాజాగా తేలింది ఏంటంటే అతను, అతని స్నేహితులు గంజాయి తీసుకుని కారు నడిపారని!.
మార్చి 13వ తేదీన హోలీనాడు వడోదరా కరేలీబాగ్‌లోని అమ్రపాలి చౌరస్తాలో ఘోరం చోటు చేసుకుంది. 23 ఏళ్ల న్యాయ విద్యార్థి రక్షిత్ చౌరాసియా తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలు వాహనాలకు మీదకు దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురుకి గాయాలయ్యాయి. ఈ ఘటన అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యింది. అంతేకాదు.. ఘటన తర్వాత కూడా చౌరాసియా ఏదో మత్తులో జోగుతూ ‘‘ఇంకో రౌండ్.. ఇంకో రౌండ్.. ఓం నమఃశివాయ’’ అంటూ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయ్యాయి.
దీంతో అతను మద్యం సేవించి బండి నడిపి ఉంటాడని అంతా భావించారు. అయితే ఆ వాదనను అతను, ఆ టైంలో అతనితో పాటు మరో ఇద్దరు స్నేహితులు తోసిపుచ్చుతూ వచ్చారు. ఘటన జరిగిన మరుసటిరోజే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతనిది ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌గా పోలీసులు ప్రకటించారు. అయితే కారు గుంతలో పడిపోయి ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నాయని.. అందువల్లే తనకేం కనబడక ఆ ప్రమాదం జరిగిందని రక్షిత్ వాదించాడు. కావాలంటే బాధిత కుటుంబాన్ని తాను పరామర్శించి.. పరిహారం అందజేస్తానంటూ ప్రకటించాడు.
ఈ క్రమంలో.. వాళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ(FSL) 20 రోజుల తర్వాత ప్రాథమిక నివేదిక వెల్లడించింది. అందులో రక్షిత్ గంజాయి సేవించి ఉన్నారని తేలింది. దీంతో ఎడీపీఎస్( Narcotic Drugs and Psychotropic Substances) యాక్ట్ 1985 ప్రకారం పోలీసులు రక్షిత్‌తోపాటు అతని స్నేహితులపైనా కేసు నమోదు చేశారు. అలాగే.. రక్షిత్‌పై మోటార్ వెహికిల్స్ యాక్ట్‌లోని సెక్షన్ 185 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే రక్షిత్ వడోదరా సెంట్రల్ జైల్‌లో ఉన్నాడు. అతని స్నేహితుడిని తాజాగా అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాని, అతని కోసం గాలింపు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.
Law student's reckless driving during Holi celebrations leaves one dead, seven injured in Vadodara. Driver admits to consuming bhang before crash#VadodaraCrash #RoadSafety #DrunkDriving #HoliTragedy #GujaratNews #JusticeForHemali #RecklessDriving #TrafficAccident #StudentCrime pic.twitter.com/2y3SgdC78P
— The Source Insight (@DSourceInsight) March 15, 2025