ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆ హంగు ఆర్భాటాలు అవసరమా? అని ప్రశ్నించారు. బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానా లేక సింగపూర్కు రాజధానా? అంటూ ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ కు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్న ఎమ్ఓయూ లు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏపీకి కోటీశ్వరుల రాజధాని కాదు సామాన్యుల రాజధాని కావాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.