చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం.. | YSRCP MLA Srikanth Reddy Fires On Chandrababu | Sakshi

ముందు టీడీపీ వ్యవస్థను మార్చుకో: శ్రీకాంత్‌ రెడ్డి

Apr 26 2018 6:32 PM | Updated on Jul 28 2018 3:49 PM

YSRCP MLA Srikanth Reddy Fires On Chandrababu - Sakshi

శ్రీకాంత్‌ రెడ్డి( పాత ఫోటో)

సాక్షి, కడప : రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి చం‍ద్రబాబు నాయుడు ఇప్పుడు గవర్నర్‌ వ్యవస్థ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు గవర్నర్‌ వ్యవస్థపై టీడీపీ ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. గవర్నర్‌ వ్యవస్థ కంటే ముందు టీడీపీ వ్యవస్థ మార్చుకో అని హితవు పలికారు.  అసెంబ్లీ స్పీకర్‌ పచ్చ కండువాలు కప్పుకొని సైకిల్‌ యాత్రలు చేస్తే తప్పు కాదా అని ప్రశ్నించారు. ఒక్క రోజు దీక్ష చేసి 30 కోట్లరూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు.

దీక్షలో డేరా బాబా స్థాయిలో ప్రతి ఒక్కరితో కాళ్లు మొక్కించుకొని చంద్రబాబు.. బాబాగా వెలిశాడని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ చెప్పిన మాటాలు ఏ రోజు అయిన విన్నావా అని ప్రశ్నించారు. బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకొని ఆ పార్టీ మంత్రి భార్యకు టీటీడీ పదవి ఇచ్చారని ఆరోపించారు. ప్రతిపక్షనేతగా వైఎస్‌ జగన్‌ లేకపోతే చంద్రబాబు రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేసే వాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం బస్సులో పడుకున్నానని చెబుతున్న చంద్రబాబు ఆ బస్సు ఖరీదు 10 కోట్లు అని మాత్రం చెప్పడం లేదన్నారు. నిత్యం బీసీల జపం చేసే చంద్రబాబు స్వయంగా బీసీలను అవమానించేలా లేఖ రాయడం దౌర్భాగ్యకరమని ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement