
సాక్షి, వైఎస్ఆర్ కడప: ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే టీడీపీ నేతలు విమర్శించడం దారుణమని వాపోయారు.
అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే బాబు, లోకేష్ ఓర్వలేకపోతున్నారని, తన అనుకూల మీడియాతో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 3 బ్యారేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. బ్యారేజీల ఏర్పాటుతో సముద్రంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని, రాయలసీమ లిఫ్ట్ ద్వారా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment