
ఎన్డీఏపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఫైర్
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్రెడ్డి, ఎ.రామకృష్ణారెడ్డి శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు.
హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్రెడ్డి, ఎ.రామకృష్ణారెడ్డి శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినా ప్రజలకు మేలు జరగలేదని వారు ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని వారు విమర్శించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు మొక్కుబడిగా తగ్గించారని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పోలిస్తే రూ. 45, 50లకే పెట్రోల్ అందించాలని కానీ అలా జరగడం లేదని వారు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే పెట్రోల్ ధర మరీ అధికంగా ఉందని గుర్తు చేశారు. పెంచిన ఛార్జీలన్ని తగ్గించాలని వారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.