
ఈస్టు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న జగన్ సేవాదళ్ సభ్యులు
తిరుపతి క్రైం: ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మానవ బాంబై చంపేస్తానని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైలం శ్రీకాంత్‌రెడ్డి, టౌన్ ఇన్‌చార్జి వళిగల మోహన్ ఈస్టు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ట్విట్టర్‌లో బిజినెస్‌మ్యాన్ అనే అకౌంట్‌లో కన్నాబాయి యూజర్ ఐడీ ఫేక్ అకౌంట్ నుంచి ఈ మేరకు బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఎంపీ గురుమూర్తి ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్టు వారు వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment