
చంద్రబాబుది బాధ్యతారాహిత్యం
ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం హైదరాబాద్ లో మాట్లాడుతూ...దేశంలో ప్రతి ముగ్గురి పిల్లల్లో ఒకరు పౌష్టకాహారలోపంతో పుడుతున్నారన్నారు. అదే విధంగా అక్షరాస్యతలోనూ వెనకబడ్డామని ఆయన తెలిపారు. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన సీఎం ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు.
ఉపాధి, ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.