సాక్షి, వైఎస్సార్ జిల్లా : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అసెంబ్లీకి రాకుండా పక్కరాష్ట్రంలో ఉండి.. మాక్ అసెంబ్లీ అంటూ నీచరాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఉండటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, లోకేష్ నీచరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. శనివారం చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ సీఎం వైఎస్ జగన్ రైతు పక్షపాతి. అర్హులైన ప్రతి రైతుకూ వేరుశనగ విత్తనాలు అందాలి. పంటల బీమాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. నాడు-నేడు కింద రూ.వందల కోట్లతో ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నాం.
ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండి రాష్ట్రానికి ఏమైనా చేశారా?. ఆయన నిర్లక్ష్యానికి నేడు ప్రాణాలు పోతున్నాయి. ఏపీ ప్రజలకు టీకాలు అవసరమని గ్లోబల్ టెండర్లు పిలవడం తప్పా?. వందల కోట్ల హెరిటేజ్ సంస్థ నుంచి ఒక్కరికైనా ఆక్సిజన్ దానం చేశారా?. పక్కరాష్ట్రాల్లో అన్ని పార్టీలు సమన్వయంతో కరోనా కట్టడికి కృషి చేస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్‌లు వారిని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి’’ అని అన్నారు.
చదవండి : కోవిడ్ కట్టడికి ప్రభుత్వం రాజీలేని పోరాటం: శ్రీకాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment