
శ్రీకాంత్ రెడ్డి
కడప: వైఎస్ఆర్ జిల్లాకు రావలసిన పరిశ్రమలను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు కక్షసాధింపు తగదని ఆయన హితవు పలికారు. జిల్లాలో ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదన్నారు.
ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఎందుకు ఆపారో తక్షణమే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చిన పరిశ్రమలను వెనక్కి పంపుతూ జిల్లా ప్రజలపై కక్షసాధించడం మంచి పద్ధతి కాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
**