Vengeance
-
'విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'
హైదరాబాద్: వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, యూనియన్ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ సమావేశానికి 13 జిల్లాల యూనియన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చలేదని అన్నారు. అలాగే వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్‌పై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తూ.. యూనియన్‌లోని ఉద్యోగులను ఇప్పటికీ రెగ్యులరైజ్ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘సాక్షి’పై కక్ష సాధింపుపై 8న ప్రెస్ కౌన్సిల్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ పత్రికపై ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఈ నెల 8వ తేదీన విచారణ చేపట్టనుంది. రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరిట మం త్రులు, అధికార పార్టీ నేతలు సాగించిన భూదందాను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పత్రికలో రాసిన వార్తలకు ఆధారాలు చూపాలంటూ సంబంధిత విలేకరులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) సెక్రెటరీ జనరల్ మార్చి 22న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)కు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై వాస్తవాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ప్రెస్ కౌన్సిల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై గుంటూరు అర్బన్ ఎస్పీ స్పందించారు. జూలై 11న కౌన్సిల్‌కు లేఖ రాశారు. ఎర్రబాలెం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విలేకరులకు నోటీసులు జారీ చేశామన్నారు. సాక్షి పట్ల సర్కారు తీరుపై 8న పీసీఐ విచారణ జరపనుంది. -
సామాన్యులపై ప్రభుత్వం కక్ష సాధింపు
-
చంద్రబాబు కక్ష సాధింపు!
కడప: వైఎస్ఆర్ జిల్లాకు రావలసిన పరిశ్రమలను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు కక్షసాధింపు తగదని ఆయన హితవు పలికారు. జిల్లాలో ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదన్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఎందుకు ఆపారో తక్షణమే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చిన పరిశ్రమలను వెనక్కి పంపుతూ జిల్లా ప్రజలపై కక్షసాధించడం మంచి పద్ధతి కాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ** -
అసెంబ్లీ ఆవరణలో శంకర్రావు మౌనదీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తన కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్రావు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో గంటసేపు మౌన దీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సీఎం, డీజీపీలు నన్ను వేధిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతను, హైకమాండ్‌కు విధేయుడిని అయిన నన్ను రెండుసార్లు అరెస్టు చేశారు. సోమవారం నా తమ్ముడిని అకారణంగా అరెస్టు చేశారు. తాజాగా నా సోదరినీ అరెస్టు చేశారు. మేం ఏ తప్పు చేశామని ఇలా వేధిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే తనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే ఎర్రచందనం కేసు విషయంలోనూ ఆ దర్యాప్తు జరిపించాలని సవాల్ విసిరారు. సీఎం తీరుతో దళిత, గిరిజన, బలహీనవర్గాలు కాంగ్రెస్‌కు దూరమయ్యాయన్నారు.