నాసిరకం బంగారం అంటగట్టేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
నాసిరకం బంగారం అంటగట్టేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన టైర్ల దుకాణం యజమాని శ్రీకాంత్‌రెడ్డికి కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన అంజనప్ప అనే వ్యక్తి గత నెలలో పలుమార్లు ఫోన్ చేశాడు. తన వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉందని, తక్కువ ధరకే ఇస్తానని నమ్మబలికాడు. శ్రీకాంత్‌రెడ్డి కోరిక మేరకు గత నెల రూ.5 లక్షల బంగారాన్ని సూర్యాపేటకు వచ్చి అందజేశాడు.
అయితే, రూ.10 లక్షల బంగారం కావాలని శ్రీకాంత్‌రెడ్డి కోరటంతో అంజనప్ప సోమవారం సూర్యాపేటకు చేరుకున్నాడు. తను తెచ్చిన 750 గ్రాముల బంగారాన్ని శ్రీకాంత్‌రెడ్డికి చూపారు. అనుమానం వచ్చిన ఆయన స్థానిక బంగారం వ్యాపారులకు చూపాడు. వారు నకిలీదని తేల్చటంతో వెంటనే శ్రీకాంత్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి అంజనప్పను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. అంజనప్ప వెంట వచ్చిన మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.