వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
సాక్షిప్రతినిధి, నల్లగొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలియజేసిన వివరాల మేరకు, హుజూర్‌నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ , సీఈసీ సభ్యుడిగా ఉన్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి జిల్లా కన్వీనర్‌గా నియమితులయ్యారు. కాగా, పార్టీ కన్వీనర్‌గా ఇప్పటి దాకా వ్యవహరించిన బీరవోలు సోమిరెడ్డిని సీఈసీ సభ్యుడిగా తీసుకున్నారు. ఇటీవలే బీరవోలు సోమిరెడ్డిని సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమించిన విషయం తెలిసిందే.