anjanappa
-
నకిలీ బంగారం విక్రయదారుడి అరెస్ట్
► సీసం ముక్కలకు బంగారం పూత..! ► అమాయకులను మోసగిస్తున్న కర్ణాటక మాయగాళ్లు సూర్యాపేట: నకిలీ బంగారం విక్రయిస్తున్న వ్యక్తిని సోమవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మొగలయ్య నిందితుడి వెల్లడించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి పట్టణంలో టైర్ల షాపు నిర్వహిస్తుంటాడు. కొద్ది రోజులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంజనప్ప శ్రీకాంత్‌రెడ్డికి ఫోన్ ద్వారా తమ దగ్గర తవ్వకాలలో దొరికిన బంగారం ఉందని, దానిని అతి తక్కువ ధరకు మీకు ఇస్తామని చెప్పాడు. పలుమార్లు ఫోన్ ద్వారా సంభాషించుకుని శ్రీకాంత్‌రెడ్డి వద్ద నుంచి ‘5లక్షలు అంజనప్ప తీసుకుని షాంపిల్‌గా కొంత నిజమైన బంగారాన్ని ఇచ్చి వెళ్లిపోయాడు. తన వద్ద ఎక్కువ మొత్తంలో బంగారం ఉందని అందుకు అదనంగా మరో ’ 10లక్షలు కావాలని అడగడంతో శ్రీకాంత్‌రెడ్డి అందుకు అంగీకరించాడు. వెంటనే అంజనప్ప బంగారపు పూత పూసిన సీసం ముక్కలను తీసుకుని సూర్యాపేటకు వచ్చాడు. కాగా శ్రీకాంత్‌రెడ్డికి వాటిపై అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్పందించిన పోలీసులు వెంటనే వారి వద్దకు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అవి నకిలీ బంగారం అని తేలడంతో నిందితుడు అంజనప్పపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా కేసుకు సంబంధించి కర్ణాటకు చెందిన మరో ముగ్గురు నిందితులు చంద్రప్ప, పర్షు, సంతోష్‌లు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సమావేశంలో పోలీసు సిబ్బంది కరుణాకర్, కృష్ణ, వెంకన్న, వెంకటేశ్వర్లు, రాజేందర్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు. -
నకిలీ బంగారం విక్రేత అరెస్టు
నాసిరకం బంగారం అంటగట్టేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన టైర్ల దుకాణం యజమాని శ్రీకాంత్‌రెడ్డికి కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన అంజనప్ప అనే వ్యక్తి గత నెలలో పలుమార్లు ఫోన్ చేశాడు. తన వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉందని, తక్కువ ధరకే ఇస్తానని నమ్మబలికాడు. శ్రీకాంత్‌రెడ్డి కోరిక మేరకు గత నెల రూ.5 లక్షల బంగారాన్ని సూర్యాపేటకు వచ్చి అందజేశాడు. అయితే, రూ.10 లక్షల బంగారం కావాలని శ్రీకాంత్‌రెడ్డి కోరటంతో అంజనప్ప సోమవారం సూర్యాపేటకు చేరుకున్నాడు. తను తెచ్చిన 750 గ్రాముల బంగారాన్ని శ్రీకాంత్‌రెడ్డికి చూపారు. అనుమానం వచ్చిన ఆయన స్థానిక బంగారం వ్యాపారులకు చూపాడు. వారు నకిలీదని తేల్చటంతో వెంటనే శ్రీకాంత్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి అంజనప్పను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. అంజనప్ప వెంట వచ్చిన మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
రిలయన్స్ తో మొయిలీ కుమ్మక్కు
రూ. కోట్లు దోచుకున్నారు ఆధారాలను ఢిల్లీలోని పాత్రికేయుడికి ఇచ్చా త్వరలో పదవికి రాజీనామా చిక్కబళ్లాపురం డీసీసీ అధ్యక్షుడు అంజనప్ప చిక్కబళ్లాపురం : కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వీరప్ప మొయిలీ, రిలయన్స్ కంపెనీ అధినేత అనిల్‌అంబానీతో కుమ్మక్కై రూ. కోట్లు దోచుకున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.అంజనప్ప ఆరోపించారు. సోమవారం ఆయనిక్కడి అంబేద్కర్ భవన్లో మాట్లాడుతూ.. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మంగళూరు నుంచి చిక్కబళ్లాపురానికి వలస వచ్చిన మొయిలీ గెలుపు కోసం 2009 ఎన్నికల్లో తాను కృషి చేశానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కబళ్లాపురం సీటు తనకు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఇటీవల తన ఇంటికి వచ్చి విధానపరిషత్ సభ్యుడిగా చేస్తానని చెప్పి మళ్లీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ, మొయిలీ గెలుపు కోసం రూ. కోట్లను ఖర్చు చేశారని తెలిపారు. మొయిలీ కుంభకోణాలకు సంబంధించిన అన్ని ఆధారాలను ఢిల్లీలోని ఓ సీనియర్ పాత్రికేయుడికి అందజేశానని చెప్పారు. ఎత్తినహొళె పేరుతో ఈ ప్రాంత వాసులను మొయిలీ మోసం చేస్తున్నారన్నారు. అది ఓ చిన్న కాలువ మాత్రమేనని, దానితో ఈ ప్రాంతవాసుల తాగునీటి సమస్య తీరదని అన్నారు. తాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని, త్వరలో మద్దతుదారులతో సమావేశమై రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మైనార్టీ విభాగం సభ్యులు సిద్దలింగాచారి, వీణారాము, లక్ష్మణ్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.