నకిలీ బంగారం అమ్మబోయి.. | fake gold seller arrested in nalgonda district | Sakshi
Sakshi News home page

నకిలీ బంగారం అమ్మబోయి..

Published Tue, Jun 28 2016 3:46 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

fake gold seller arrested in nalgonda district

నకిరేకల్: నాసిరకం బంగారాన్ని అంటగట్టేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో ఈ ఘటన జరిగింది. పట్టణ శివారులోని వాసవీనగర్‌కు చెందిన బంగారు దుకాణం యజమాని వద్దకు కొన్నాళ్ల క్రితం రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి వచ్చాడు. తన వద్ద ఉన్న కొంత బంగారాన్ని తక్కువ ధరకే విక్రయించి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం కూడా వచ్చిన ఆ వ్యక్తి తన వద్ద కిలో బంగారం ఉందని చూపాడు. దానిని పరీక్షించిన ఆ వ్యాపారి అది నాసిరకమని తేల్చాడు. ఈ విషయమై అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement