
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కులమతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. లౌకిక దేశంలో ఓట్ల కోసం బీజేపీ మత చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ ఆర్డినెన్స్‌పై పార్లమెంట్, సుప్రీం కోర్టులు వ్యతిరేకించినా..బీజేపీ మొండిగా వెళ్తుందని విమర్శించారు.
అభివృద్ధితో ఎన్నికలకు వెళ్లాలి కానీ.. మతాల మధ్య చిచ్చు పెట్టి కాదని హితవు పలికారు. లౌకిక ఆశయాలు కలిగిన వ్యక్తి మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోందన్నారు. దేశ సమగ్రత విషయంలో రాజీపడే ప్రశక్తే లేదన్నారు. బీజేపీ కూడా అలాంటి నిర్ణయం తీసుకోకుంటే నిలదీస్తామని హెచ్చరించారు. విభజన సమయంలో ఏపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment