రాజీవ్ స్వగృహతో పేదలకు మేలు జరుగుతుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: రాజీవ్ స్వగృహతో పేదలకు మేలు జరుగుతుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాక ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం రాజీవ్ స్వగృహను ప్రవేశపెట్టారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. నిర్ణీత ప్లాన్ ప్రకారమే ఇళ్ల నిర్మాణం జరగాలని సూచించారు. రాజీవ్ స్వగృహ ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు.