రేపటి నుంచి వస్త్ర దుకాణాల బంద్‌ | Garment shops bandh from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి వస్త్ర దుకాణాల బంద్‌

Published Thu, Jul 13 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

Garment shops bandh from tomorrow

కర్నూలు (ఓల్డ్‌సిటీ): జీఎస్‌టీ విధింపునకు నిరసనగా శుక్రవారం నుంచి  కర్నూలు నగరంలోని వస్త్ర దుకాణాలు బంద్‌ పాటించనున్నాయి. ఏపీ టెక్స్‌టైల్స్‌ ఫెడరేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు శుక్ర, శని, ఆది వారాల్లో నగరంలో వస్త్ర దుకాణాల బంద్‌ నిర్వహించనున్నట్లు కర్నూలు క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు జి.ప్రసాద్, కె.ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు వారు బుధవారం సాయంత్రం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై జీఎస్‌టీని ఉపసంహరించాలని కోరారు. డిమాండ్ల సాధన కోసమే బంద్‌ పాటిస్తున్నామని, కార్యక్రమానికి నగరంలోని వస్త్ర వ్యాపారులంతా సహకరించాలని వారు ఆ ప్రకటనలో విజ్ఙప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement