garments
-
పిల్లల కథ: ఎవరికి విలువ?
ఒకరోజు ఒంటరిగా ఒక మూల కూర్చొని బాధపడుతున్న చెప్పుల దగ్గరకు టోపీ వచ్చి ‘ఏం చెప్పుమామా! దిగాలుగా ఉన్నావు’ అని పలకరించింది. దానికి జవాబుగా చెప్పు ‘ఏంలేదు అల్లుడు! రోజంతా నన్ను తొక్కి తొక్కి.. నా నారతీసి చివరికి ఇలా మూలనపడేస్తున్నారు ఈ మనుషులు. వాళ్ళ బరువు మోయలేక, వాళ్లు తిరిగే దారిలో ముళ్ళు, రాళ్ళ దెబ్బలు, మురుగు వాసన భరించలేక అలసిపోతున్నాను. నా మీద జాలి కూడా ఉండదు. అవసరం తీరిపోగానే, కనీసం శుభ్రం చేయకుండానే పక్కన ఇలా పడేస్తారు’ అని ఏడవసాగింది. చెప్పు వేదన విని టోపీ కళ్ళల్లో నీళ్ళు చిమ్మాయి. ‘నా బాధ ఎవరోతో చెప్పుకోను మామా! నన్ను ఎండలో మాడ్చేసి, వర్షంలో తడిపేసి నాలో తేజస్సు మొత్తం హరించేస్తున్నారు. అవసరం తీరాక నన్ను కూడా ఏదో ఒక మూల పడేస్తారు. అవసరం ఉన్నంత వరకే మన ఉపయోగం. తర్వాత మనల్ని పట్టించుకునే నాథుడే ఉండడు’ అంటూ వాపోయింది టోపీ. వీళ్ల సంభాషణ మధ్యలోకి బట్టలు వచ్చాయి.. ‘మీ పని పరవాలేదు కానీ మాకు మరీ నరకం. ఎండ, వాన, చలి అని తేడా లేకుండా రోజంతా పని చేస్తాం. దుమ్ము, ధూళి, చెమట వాసన భరించలేకపోతున్నాం. కాస్త రంగు మారితే మమ్మల్ని పక్కన పడేస్తున్నారు’ అంటూ భోరున కన్నీరు కార్చాయి. చెప్పు, టోపీ, బట్టల వేదనాభరితమైన సంభాషణను పక్క నుండి వింటున్న బంగారం వారందరినీ పిలిచింది. ‘మీరంతా పిచ్చివాళ్ళలా ఆలోచించకండి.. నన్ను ఈ మనుషులు ఆడంబరం కోసం మీ అందరి కన్నా ఎక్కువ డబ్బులు పోసి కొని, తమ దర్జా చూపడానికి వేడుకల్లో నన్ను అలంకరించుకుని, తర్వాత బీరువాలో దాచేస్తుంటారు. మనల్ని తమ అవసరం కోసం మనిషి తయారుచేశారని మనం గుర్తుంచుకోవాలి. మీరు నిరంతరం మనిషికి ఉపయోగపడతారు. నేను కేవలం ఆడంబరం కోసం మాత్రమే ఉపయోగపడతాను. ఒక్కో సమయంలో ఒక్కో వస్తువుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ సృష్టిలో ఏది కూడా ప్రాధాన్యం లేకుండా ఉండదు. సమయాన్ని బట్టి వాటికి విలువ ఉంటుంది. అందుచేత మీరు అనవసరంగా ఆలోచించి, మీ విలువను మీరు తగ్గించుకుని బాధపడకండి’ అని హితబోధ చేసింది. ఆ మాటలు విన్న మిగతా వస్తువులు వాటి విలువ తగ్గలేదని తెలుసుకుని బంగారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆనందంగా సేదతీరాయి. అదేవిధంగా ఈ సృష్టిలో మనిషి కూడా ఏదో ఒక సమయంలో తన విలువ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎదుటివారిని బాధపెడుతుంటారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవరాశికి ఒక ప్రాధాన్యం ఉంటుంది. అది మనతో పాటు ఎదుటివారికి కూడా ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని మనమంతా గుర్తించి ఆనందంగా జీవిద్దాం. అందరికీ ఆనందాన్ని పంచుదాం. ఇతరులను గౌరవిస్తూ ముందడుగు వేస్తేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. మరిన్ని పిల్లల కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జగనన్న కాలనీల్లోనే మహిళలకు ఉపాధి
రాప్తాడురూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో నివాసాలు ఉండే మహిళలకు గార్మెంట్స్ పరిశ్రమల ద్వారా స్థానికంగానే ఉపాధి కల్పిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ఇప్పటికే పలుమార్లు తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలకు వెళ్లి కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. వారిని స్వయంగా పిలిపించి ఇక్కడి ప్రదేశాలను చూపించారు. తాజాగా ఎమ్మెల్యే చొరవతో తిర్పూర్‌కు చెందిన బెస్ట్ ఇంటర్నేషనల్ గార్మెంట్స్ చైర్మన్ ఎస్.రామస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.రాజ్‌కుమార్, సీఈఓ గౌతంరెడ్డి శుక్రవారం ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు. అనంతపురం మండలం ఆలమూరు సమీపంలోని పీవీకేకే కళాశాల వద్ద హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తదితరులు బొకేలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహనంలో ఆలమూరు జగనన్న కాలనీకి చేరుకుని పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదల కోసం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో నివాసాలు ఉండే మహిళలకు స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉదయం, రాత్రి రెండు షిఫ్టులూ పరిశ్రమలు నడిపేందుకు అనుకూలంగా ఉంటాయని యజమానులు భావిస్తున్నట్లు చెప్పారు. కారి్మకుల రవాణా కోసం బస్సు సదుపాయం కూడా కలి్పంచేలా చర్యలు తీసుకుంటారన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే తమిళనాడు, జైపూర్ నుంచి అనేకమంది వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. గార్మెంట్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ మంచి వాతావరణం ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. వారివెంట రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ బెడదూరి గోపాల్‌రెడ్డి, మాజీ చైర్మన్ తాటిచెర్ల నాగేశ్వరెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, అనంతపురం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పవన్‌కుమార్, నాయకులు వడ్డే శీనా, ఉప్పరపల్లి సర్పంచ్ సావిత్రి శ్రీనివాసులు, కక్కలపల్లి సర్పంచ్ గార్లదిన్నె కృష్ణయ్య, నాయకులు ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు. పరిశ్రమలతోనే రాష్ట్రాభివృద్ధి రాప్తాడు: పరిశ్రమల ఏర్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో పరిశ్రమల కోసం సేకరించిన భూములను శుక్రవారం బెస్ట్ ఇంటర్నేషనల్ గార్మెంట్స్ చైర్మన్ రామస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.రాజ్‌కుమార్, సీఈఓ గౌతంరెడ్డి, రామ్ రాజ్ కాటన్ సంస్థ ప్రతినిధి సుందరమూర్తితో కలిసి వారు పరిశీలించారు. సమీపంలోని జగనన్న లేఅవుట్, టిడ్కో ఇళ్లను పరిశీలించారు. (చదవండి: నువ్వా నేనా..అనంత అసెంబ్లీ టెక్కెట్ దక్కేదెవరికో..?) -
రంగురంగుల దుస్తులు.. చినుకులతో కలిసి చిందేయ్యండి
వసంతమాసంలోనే పువ్వుల సింగారం గురించి మాట్లాడుకుంటాం. కానీ, చినుకు సందడి చేసే వర్షాకాలంలోనూ పువ్వుల సందడి ఎంత అందాన్నిస్తుందో మాటల్లో చెప్పలేం.పచ్చని ప్రకృతి చినుకు స్నానం చేస్తుంటే.. పూల సింగారం విహారానికి వస్తే..మబ్బు పట్టిన నింగి నుంచి నేలకు మెరుపు దిగివచ్చినట్టే. మీదైన ముద్ర తెలియాలంటే ఈ కాలం రకరకాల ప్రింట్ల దుస్తులను ఎంపిక చేయండి. రంగురంగులుగా చినుకులతో కలిసి చిందేయ్యండి. రంగుల వర్ణాలు వేడి నుండి చినుకులు ఉపశమనం ఇచ్చేదే ఈ సమయం. కాకపోతే చెత్త రోడ్లు, తడిపాదాలు, ట్రాఫిక్ మనకు రకరకాల పరీక్షలను తీసుకువస్తాయి. కాబట్టి, రుతుపవనాలు మీ స్టైల్‌ను ఎలా తగ్గించబోతున్నాయనే దాని గురించి చింతిస్తున్నట్లయితే ముందుగా, రెయిన్ గేర్ ఎంపిక బెస్ట్ ఎంపిక అంటారు ఇండియన్ డిజైనర్ మసాబా గుప్త. ‘ఈ కాలం ప్రకాశవంతమైన నారింజ, ఎరుపు, పసుపు, గులాబీ, నీలం రంగులు మబ్బుగా ఉండే వాతావరణాన్ని ఎదుర్కోవడానికి సరైనవి. లైక్రా లేదా పాలిస్టర్ వంటి లైట్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్లను ధరించడం మంచిది. ఎందుకంటే అవి ముడతలు పడకుండానూ, సులభంగా పొడిగా మారడానికి ఉపయోగపడతాయి. బయటకు వెళ్లేటప్పుడు బిగుతుగా ఉండే ఏదైనా బాటమ్‌ను ఎంచుకోండి. కానీ డెనిమ్, కాడ్రాయ్ల నుండి దూరంగా ఉండండి. పలాజోలు కూడా బాటమ్‌గా ఈ కాలం బాగుంటాయి. ►ఈ కాలం లెదర్ చెప్పులు, బ్యాగులకు దూరంగా ఉండండి. బదులుగా, రంగురంగుల బాలేరినా ఫ్లాట్లు, జెల్లీ షూస్, ఫ్లిఫాప్స్, ఫ్లోటర్లు లేదా క్రోక్స్‌ను ఎంచుకోండి. వాటర్‌ప్రూఫ్, టోట్తో చేసిన అధునాతన బ్యాగ్‌లు వాడటం మేలు. ►తేమతో కూడిన వాతావరణం కారణంగా జుట్టు చిట్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి, చక్కని బన్ను లేదా పోనీ టైల్ మంచిది. హాట్ బ్లో డ్రైయింగ్, కర్లింగ్ లేదా స్ట్రెయిటెనింగ్ ఐరన్‌లతో కూడిన హెయిర్స్టైల్స్కు ఈ కాలం దూరంగా ఉండటమే మంచిది. ►మేకప్ విషయానికి వస్తే చాలా తక్కువ చేసుకోవాలి. వాటర్‌ప్రూఫ్ మస్కారాకు బదులు కొద్దిగా పెట్రోలియమ్ జెల్లీతో మీ కనురెప్పలను దిద్దుకోవచ్చు. ముఖం కోసం బ్రౌన్, న్యూడ్ లేదా కాఫీ రంగులో క్లీన్ టోన్లను ఉపయోగించాలి. పీచ్ సూపర్ మ్యాట్ లిప్స్టిక్స్ బాగుంటాయి. ముఖ్యంగా, శుభ్రం చేయడానికి కష్టంగా ఉండే మేకప్‌కు దూరంగా ఉండాలి’ అని తెలియజేస్తున్నారు. కాంతిమంతం ►అబ్స్ట్రాక్ట్ ప్రింట్లు ఉన్న సిల్క్ డ్రెస్సులు, చీరలు ఈ కాలాన్ని మరింత ఉత్తేజితంగా మార్చేస్తాయి. ►చిన్నపాటి గెట్ టుగెదర్ పార్టీలకు ప్రింటెడ్ ఆర్గంజా వంటివి బాగుంటాయి. అయితే, వర్షంలో తడిస్తే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కనుక ఇబ్బందిగా ఉంటుంది. కానీ, డల్‌గా ఉన్న వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చేసే సుగుణం ఈ ప్రింట్లకు ఉంటుంది. ►ఓవర్ కోట్స్, జంప్ సూట్స్ .. సౌకర్యంగా ఉండే ఏ డ్రెస్ అయినా ఏదో ఒక చిన్న ప్రింట్ అయినా ఉన్నవి ఎంచుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు. తేలికైన సిల్క్ ప్రింట్లు ‘వర్షాకాల వివాహాలకు పూల ప్రింట్లు సరైనవి. తేలికగా ఉండే షిమ్మర్ బ్లైజ్, సిల్క్ లెహంగాకు పెద్ద పెద్ద బార్డర్లు లుక్‌కి గ్లామరస్ టచ్‌ని జోడిస్తాయి. అంతేకాదు రంగుల ఎంపికలలో పీచ్, పగడపు రంగులు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి మీదకు చిన్న పొట్లీ వంటి ఆభరణాలు మరింత అందాన్నిస్తాయి’ అంటారు ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి. -
తనపై ఉమ్మిపడిందని వాగ్వాదం.. క్షణికావేశంలో..
పట్నా(బిహార్): క్షణికావేశంలో జరిగే సంఘటనలు ఒక్కొసారి వ్యక్తుల ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తుంటాయి. ఇలాంటి సంఘటనలు మనం వార్తలలో చదువుతుంటాం. ఇలాంటి ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సివాన్జిల్లాలోని పోఖ్రాప్రాంతంలో అహ్సాన్ మాలిక్ అనేవ్యక్తి.. వీధిలో బట్టల వ్యాపారం చేస్తుండేవాడు. అదే ప్రాంతంలో.. రెండో అంతస్థులో తన మిత్రులతో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో ఒకరోజు తన ఇంట్లోని బాల్కని ఉన్న కిటికీ నుంచి అనుకోకుండా పాన్తిని కిందకు ఉమ్మివేశాడు. అది కాస్త.. కింద నిలబడిన ఒక వ్యక్తిపై పడింది. అతను కోపంతో ఊగిపోయి.. అహ్సాన్ ఇంటికి వెళ్లాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా క్షణికావేశంలో అహ్సాన్ మాలిక్‌ను కాల్చిచంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, బుల్లెట్ శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: హరియాణా ఆవిర్భావ దినోత్సవం: ఖైదీలకు సీఎం ఖట్టర్ తీపికబురు -
టెక్స్ టైల్ ఎగుమతిదారులకు ఊరట
న్యూఢిల్లీ: జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ కేంద్రం కీలక చర్య తీసుకుంది. ఆర్ఓఎస్సీటీఎల్ (రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్) స్కీమ్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. జూలై 14న కేంద్ర క్యాబినెట్ ఈ పథకం పొడిగింపునకు ఆమోదముద్ర వేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్‌పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది. అంతర్జాతీయ పోటీకి దీటుగా... అంతర్జాతీయంగా ఈ రంగంలో పోటీని ఎదుర్కొనడానికి ఎగుమతిదారులకు తాజా నిర్ణయం దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) చైర్మన్ ఏ శక్తివేల్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, కాంబోడియా, శ్రీలంక వంటి దేశాల నుంచి పోటీని ఎగుమతిదారులు తట్టుకోగలుగుతారని పేర్కొన్నారు. స్థిరమైన పన్ను రేట్ల వల్ల ఈ రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాలన్న లక్ష్యంలో వేసిన తొలి అడుగుగా దీనిని అభివర్ణించారు. ఎగుమతుల పురోగాభివృద్ధికే కాకుండా ఈ రంగంలో స్టార్టప్స్ ఏర్పాటుకు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు కూడా ఈ చర్య పరోక్షంగా దోహపడుతుందని అభిప్రాయపడ్డారు -
వెయ్యి కోట్ల భారీ పెట్టుబడి
సాక్షి, హైదరాబాద్/గీసుకొండ: చిన్నపిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సంస్థ ‘కిటెక్స్’ (కిటెక్స్ గ్రూప్) తెలంగాణలో పెట్టుబ డులు పెట్టనుంది. తొలిదశలో వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కిటెక్స్ సంస్థ ఎమ్డీ సాబు ఎం. జాకబ్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడతామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ విధానాలు, వస్త్ర పరిశ్రమకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు తమకు నచ్చాయని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అరుదని ప్రశంసించారు. సాబు జాకబ్‌తో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శుక్రవారం కొచ్చి నుంచి హైదరాబాద్ చేరుకుంది. అనంతరం టీఎస్ఐఐసీ ఎండీ నర్సిం హారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందంతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్‌లోని కేఎంటీపీని సందర్శించింది. అనంతరం హైదరాబాద్ తిరిగొచ్చి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రత్యే కంగా భేటీ అయింది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలు, పారిశ్రామిక విధానం ప్రత్యేకతల గురించి కిటెక్స్ బృందానికి మంత్రి కేటీఆర్ వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు, పారిశ్రామిక అవసరాలకు నిరంతర విద్యుత్, పత్తిసాగులో రాష్ట్రం ప్రత్యేకత తదితర అంశాల గురించి విపులంగా తెలియజేశారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ వంటిది దేశంలో ఎక్కడా లేదన్న కిటెక్స్ ప్రతినిధి బృందం.. ప్రభుత్వ విధానాలపై, తమ ప్రతిపాదనలకు సర్కారు స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా కిటెక్స్ గ్రూపు కార్యకలాపాలను మంత్రి కేటీఆర్‌కు వివరించింది. కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి తమ టీయస్ ఐపాస్ చట్టం మేరకు మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని, దీని ప్రకారం టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ అధికారులు శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సర్కారు సత్వర చొరవతో.. కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిటెక్స్.. తాజాగా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేసింది. దీంతో తెలంగాణ సహా 9 రాష్ట్రాలు ఆ సంస్థను ఆహ్వానించాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన స్పందించింది. సాబు జాకబ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందాన్ని రప్పించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టేందుకు కిటెక్స్ ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. సంస్థ ప్రతినిధులు వరంగల్ టెక్స్టైల్ పార్క్‌ను సందర్శించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. -
చేతులు లేకపోతేనేం....
చండీగఢ్: చేతులు లేనివారు కాళ్లతోని ఇంటి పనులు, వంట పనులు చేసుకోవడం, కాళ్లతోనే పరీక్షలు రాయడం, కాళ్లతోని బొమ్మలు గీయడం లాంటివి మనం అప్పుడప్పుడు పత్రికల్లో చూస్తుంటాం. కానీ హర్యానాలోని మదన్‌లాల్ అనే 45 ఏళ్ల వ్యక్తి కాళ్లతోని టైలరింగ్ చేయడం ఎక్కడా చూసి ఉండం. బట్టల కొలతలు తీసుకోవడం, వాటిని పొందికగా కావాల్సిన తీరులో కత్తిరించడం, కుట్టు చెదరకుండా వాటిని కుట్టడం చేతులున్న వారికే కష్టమైన పని. ఈ మూడు పనులను అతి నైపుణ్యంతో చేస్తూ గ్రామ ప్రజల మనసులను, మన్ననలను దోచుకుంటున్నారు మదన్‌లాల్. ఆయన రెండు చేతుల్లేకుండానే పుట్టారు. ఏ బడికెళ్లిన దివ్యాంగుడివి, చదువు నేర్చుకోవడం రాదంటూ తిప్పి పంపించారట. దివ్యాంగులను కూడా చేర్చుకునే పట్నం బడులకు వెళ్లేంత స్థోమత ఆయన కుటుంబానికి లేకపోవడం వల్ల ఇక చదువుకోవలనే ఆశను చంపుకున్నారు. నానమ్మ, తాతయ్యలకు చేదోడు, వాదోడుగా ఇంట్లో పనులు చేస్తూ వచ్చారు. 23 ఏళ్ల ప్రాయంలో ఏదైనా వృత్తిలో స్థిరపడి సంపాదించాలనుకున్నారు. అందుకు టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నారు. ఊరు, వాడా తిరిగారు. టైలరింగ్ నేర్పేందుకు ఎవరూ ఒప్పుకోలేదు. పైగా గేలిచేసి పంపించారు. చివరకు పొరుగునున్న ఫతేహబాద్కు వెళ్లారు. ఎంతో నచ్చచెప్పగా అక్కడ ఓ టైలర్ శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆయన వద్ద టైలరింగ్ నేర్చుకొని కొంతకాలం అక్కడే గడిపిన మదన్‌లాల్ చివరకు తన ఊరుకు వచ్చి ఓ టైలరింగ్ షాపు పెట్టుకున్నారు. వచ్చేవారికి, పోయే వారికి తన నైపుణ్యం గురించి చెబుతూ వచ్చారు. మొదట ఎవరూ నమ్మలేదు. ఆయన వద్ద బట్టలు కుట్టించుకునేందుకు ధైర్యం చేయలేదు. తాను ఎలా కుడతానో ప్రాక్టికల్‌గా కుట్టి చూపించగా అప్పటి నుంచి గిరాకీ రావడం మొదలైంది. ఇప్పుడు ఆయన టైలరింగ్ షాపు సంతప్తికరంగా నడుస్తోంది. మదన్‌లాల్ తన వంట తానే చేసుకోవడంతోపాటు తీరక వేళల్లో కాళ్లతోనే చీట్ల పేక ఆడతారు. ఆత్మవిశ్వాసం, అందుకుతగ్గ కషి ఉండాలిగానీ అనుకున్నది దేన్నైనా సాధించవచ్చని మదన్‌లాల్ తన అనుభవపూర్వకంగా చెబుతున్నారు. -
రేపటి నుంచి వస్త్ర దుకాణాల బంద్
కర్నూలు (ఓల్డ్‌సిటీ): జీఎస్టీ విధింపునకు నిరసనగా శుక్రవారం నుంచి కర్నూలు నగరంలోని వస్త్ర దుకాణాలు బంద్ పాటించనున్నాయి. ఏపీ టెక్స్టైల్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్ర, శని, ఆది వారాల్లో నగరంలో వస్త్ర దుకాణాల బంద్ నిర్వహించనున్నట్లు కర్నూలు క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జి.ప్రసాద్, కె.ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వారు బుధవారం సాయంత్రం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై జీఎస్టీని ఉపసంహరించాలని కోరారు. డిమాండ్ల సాధన కోసమే బంద్ పాటిస్తున్నామని, కార్యక్రమానికి నగరంలోని వస్త్ర వ్యాపారులంతా సహకరించాలని వారు ఆ ప్రకటనలో విజ్ఙప్తి చేశారు. -
ఆప్కోలో గోల్మాల్ రూ.600 కోట్లు?
చేనేత సొసైటీలకు బదులు తమిళనాడు నుంచి వస్త్రాల కొనుగోళ్లు * తక్కువ ధరకు నాసిరకం వస్త్రాలు తెచ్చి ఎక్కువ ధరకు అంటగట్టిన వైనం * ఉత్పత్తే చేయని స్థానిక సొసైటీల పేరిట దొంగ బిల్లులు * పాలకమండలి సభ్యులు, అధికారుల పాత్రపై అనుమానాలు * ఆర్వీఎంకు వస్త్రాల సరఫరాలోనూ భారీగా అవకతవకలు * నెల రోజులుగా ముందుకు సాగని త్రిసభ్య కమిటీ విచారణ * విచారణలో కమిటీకి సహకరించని టెస్కో పాలక మండలి, అధికారులు సాక్షి, హైదరాబాద్: చేనేత సహకార సంఘాల ముసుగులో ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో)లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయి. పాలకమండలి సభ్యులు, అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో నెలకొన్న పాలనా సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని రూ. 600 కోట్ల మేర సొమ్మును పక్కదారి పట్టించారు. తమిళనాడులో పవర్‌లూమ్‌లపై తయారైన నాసిరకం వస్త్రాన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసుకువచ్చి... ఇక్కడి చేనేత సహకార సంస్థల పేరిట ఎక్కువ ధరకు అంటగట్టారు. ఇందుకోసం తప్పుడు రికార్డులు సృష్టించారు. ప్రస్తుతం వస్త్రోత్పత్తి చేయడం లేని చేనేత సహకార సొసైటీల నుంచి కూడా వస్త్రాన్ని సేకరించినట్లు, ఆ సొసైటీలు లావాదేవీలు జరిపినట్లు రికార్డులు తయారు చేశారు. ఇలా సేకరించిన నాణ్యత లేని వస్త్రాన్ని రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) కింద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సరఫరా చేయడంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా అంటగట్టారు. ఇందులో విద్యార్థులకే కోట్లాది మీటర్ల వస్త్రాన్ని సరఫరా చేశారు. ఒక్కో మీటర్ వస్త్రంపై మూడు నుంచి నాలుగు రూపాయల చొప్పున కమిషన్ రూపంలో జేబులో వేసుకున్నారు. వాస్తవానికి రాష్ట్ర విభజన నేపథ్యంలో గతేడాది జూలైలో ఆప్కోను విభజించి తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో)ను ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్ర విభజన (అపాయింటెడ్ డే) తర్వాత కూడా ఉమ్మడిగానే వస్త్రాల కొనుగోలు, ఇతర లావాదేవీలు జరగడంపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్పత్తే లేని సొసైటీల నుంచి కొనుగోళ్లు! తెలంగాణలో 545 చేనేత సహకార సంఘాలు ఉండగా.. వాటిలో కేవలం 60 సొసైటీలు మాత్రమే చురుగ్గా వస్త్రోత్పత్తి చేస్తున్నాయి. ఈ సొసైటీల ద్వారా తయారయ్యే వస్త్రాల విలువ రూ.50 కోట్లకు మించి ఉండదని అంచనా. కానీ రాష్ట్రంలోని సొసైటీల నుంచే సుమారు రూ.300 కోట్ల విలువ చేసే వస్త్రాలను కొనుగోలు చేసినట్లు ఆప్కో అధికారులు రికార్డులు సృష్టించారు. తమిళనాడు నుంచి ఏమాత్రం నాణ్యత లేని వస్త్రాలను తెచ్చి ఇక్కడి సొసైటీల్లో ఉత్పత్తి చేసినట్లు దొంగ రసీదులు చూపారు. ఉదాహరణకు ప్రస్తుతం టెస్కో పాలక మండలి సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న సొసైటీ కొన్నేళ్లుగా అంగుళం వస్త్రాన్ని కూడా ఉత్పత్తి చేయడం లేదు. కానీ ఆ నేత తమ సొసైటీ ఏటా వస్త్రోత్పత్తి ద్వారా రూ.50 లక్షల మేర లావాదేవీలు జరిపినట్లు రికార్డులు సృష్టించాడు. ఇదే తరహాలో కొందరు పాలక మండలి సభ్యులు, అధికారులు కుమ్మక్కై బినామీ లావాదేవీలు చూపారు. కేవలం రాజీవ్ విద్యా మిషన్‌కు సరఫరా చేసిన వస్త్రాల ద్వారానే రూ.400 కోట్లు పక్కదారి పట్టినట్లు అంచనా. ఇక చేనేత సహకార సంఘాలకు ఆప్కో నుంచి రూ.133 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉండగా... ప్రస్తుతం ఆప్కో గోదాముల్లో కోటి రూపాయల విలువ చేసే వస్త్రాలు కూడా నిల్వ లేవు. దీనిపైనా లెక్కలు తేలాల్సి ఉంది. మరోవైపు బకాయిలను సాకుగా చూపుతూ సంఘాల నుంచి కొనుగోళ్లు నిలిపివేయడంతో చేనేత కార్మికుల వద్ద రూ.5 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు పేరుకుపోయాయి. ఆరు నెలలుగా వేతనాలు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్రిసభ్య కమిటీతో విచారణ అపాయింటెడ్‌డే నుంచి జరిగిన లావాదేవీలపై ప్రాథమిక విచారణ జరపాల్సిందిగా చేనేత విభాగం డిప్యూటీ డెరైక్టర్ రామగోపాల్, ఏడీలు వెంకటేశ్వర్లు, రత్నమాలలతో కూడిన కమిటీని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఏర్పాటు చేశారు. సహకార సంఘాల వారీగా సేకరించిన వస్త్రం, ఏ ప్రభుత్వ విభాగానికి ఎంత సరఫరా చేశారు వంటి అంశాలపై ఈ కమిటీ ఆప్కో నుంచి వివరాలు కోరింది. అయితే ఈ వ్యవహారంలో కొందరు పాలక మండలి సభ్యులతో పాటు ఓ కీలక అధికారి పాత్ర ఉండటంతో.. కమిటీకి సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలిసింది. ఆప్కో అక్రమాలపై లోతుగా విచారణ జరిగితే తప్ప పూర్తి వివరాలు వెలుగు చూసే అవకాశం కనిపించడం లేదు.