తమిళనాడులో గత 4 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమి స్తున్నట్లు సినిమా థియేటర్ల సంఘం అధ్య క్షుడు అభిరామి రామనాథన్ గురువారం మీడియాకు తెలిపారు.
చెన్నై: తమిళనాడులో గత 4 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమి స్తున్నట్లు సినిమా థియేటర్ల సంఘం అధ్య క్షుడు అభిరామి రామనాథన్ గురువారం మీడియాకు తెలిపారు. సినీ థియేటర్ల యా జమాన్యం బంద్‌ను ప్రకటించిన నేపథ్యం లో చిత్ర పరిశ్రమ ప్రముఖులతో గురు వారం రాష్ట్ర సీఎం పళనిస్వామి, మంత్రులు చర్చలు జరిపారు. పన్ను వ్యవహారంపై ప్రభుత్వం తరఫున 8 మంది, చిత్ర పరిశ్రమకు చెందిన ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు అభిరామి తెలిపారు.