విద్యార్థి సంఘ నాయకుల అరెస్ట్
Published Fri, Jul 21 2017 1:41 PM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM
హైదరాబాద్: విద్యారంగంలో తిష్టవేసిన సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు కలిసి విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థులకు ఉపకారవేతనాలు సకాలంలో చెల్లిచండంతో పాటు, ప్రైవేటు విద్యాసంస్థల దోపడీని అరికట్టాలంటూ అన్ని జిల్లాల్లో విద్యార్థి సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి.
నగరంలోని నారాయణగూడలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Advertisement