భారీగా పోలీసుల మోహరింపు...అర్ధరాత్రి బీజేపీ నాయకుల అరెస్ట్
గొడవకు కారణమైన 45 మందిపై కేసు...9 మందికి రిమాండ్
సాక్షి, హైదరాబాద్/ మెదక్‌జోన్/శంషాబాద్: మెదక్ పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది. బీజేపీ నేతల ఆదివారం బంద్‌కు పిలుపునివ్వగా, వర్తక, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఇరువర్గాల ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. శనివారం అర్ధరాత్రి దాటాక బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం నేత సతీ‹Ùతోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం వారిని జడ్జి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించగా మెదక్ సబ్ జైలుకు తరలించారు.
ఎవరినీ ఉపేక్షించం: ఐజీ రంగనాథ్
గొడవకు బాధ్యులైన ఎవరినీ ఉపేక్షించమని, ఇందుకు కారణమైన 45 మందిపై కేసులు నమోదు చేశామని మల్టీజోన్ ఐజీ రంగనాథ్ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన 23 మందితోపాటు 22 మంది ముస్లింలపై కేసులు నమోదు చేశామన్నారు. పోలీసులు ఒక్కవర్గం వారిని మాత్రమే రిమాండ్ చేశారని, మరోవర్గం వారిని చేయలేదంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దని, ఘటనకు బాధ్యులైన ముస్లింలను కూడా రిమాండ్ చేస్తామన్నారు.
» మెదక్‌లో రెండువర్గాల మధ్య జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
» మెదక్ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఎలాంటి మత కల్లోలాలకు తావు లేకుండా పూర్తి ప్రశాంతంగా ఉండేదని గుర్తు చేశారు.
» గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మెదక్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ముంబయి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అల్లర్లలో గాయపడిన వారిని మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పరామర్శించారు. అనంతరం రాజాసింగ్ తన నివాసానికి వెళ్లేంత వరకు ఆర్‌జీఐఏ పోలీసులు ఆయన వెంటే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment