కార్యకర్త హత్య, స్ట్రైక్‌కు పిలుపు | RSS activist killed in Kerala, BJP calls for state bandh | Sakshi
Sakshi News home page

కార్యకర్త హత్య, స్ట్రైక్‌కు పిలుపు

Published Sun, Jul 30 2017 10:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కార్యకర్త హత్య, స్ట్రైక్‌కు పిలుపు - Sakshi

కార్యకర్త హత్య, స్ట్రైక్‌కు పిలుపు

తిరువనంతపురం: కేరళ రాజధాని తిరవనంతపురంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. 34 ఏళ్ల రాజేశ్‌ శుక్రవారం రాత్రి రోడ్డుపై వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేసి ఎడమ చేతిని నరికేశారు.

తీవ్రంగా గాయపడిన రాజేశ్‌.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీపీఎం కార్యకర్తలే రాజేశ్‌పై దాడి చేశారని ఆరోపించింది. హత్యకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్త స్ట్రైక్‌కు పిలుపునిచ్చింది.

పాత కక్షలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల క్రితమే కేరళలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement