
బీజేపీ కార్యకర్త దారుణ హత్య
కేరళలోని కన్నూరు జిల్లాలో భారతీయ జనతాపార్టీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. బాధితుడు రెమిత్‌ను పట్టపగలు 10 గంటల సమయంలో పినరయి గ్రామంలో ఒక పెట్రోలు బంకు ఎదురుగా నరికి చంపేశారని పోలీసులు తెలిపారు. రెమిత్ తండ్రి కూడా కొన్నేళ్ల క్రితం హత్యకు గురయ్యారు.
తాజాగా సీపీఎం సీనియర్ నాయకుడు కె. మోహనన్ (52) హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. కాగా ఈ రెండు హత్యలు కూడా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మడామ్ నియోజకవర్గం పరిధిలోనే జరగడం విశేషం.