అమెరికా పర్యటన విజయవంతం- మంత్రి కేటీఆర్ | Minister KTR successful visit to USA | Sakshi
Sakshi News home page

అమెరికా పర్యటన విజయవంతం- మంత్రి కేటీఆర్

Published Fri, Jun 10 2016 6:05 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Minister KTR successful visit to USA

హైదరాబాద్ : రెండు వారాలపాటు సాగిన అమెరికా పర్యటన విజయవంతమైందని మంత్రి కేటీఆర్ శుక్రవారం తెలిపారు. అమెరికాలోని అనేక రాష్ట్రాలతో తెలంగాణ నూతన సంబంధాలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ పర్యటన దోహదం చేసిందన్నారు. తెలంగాణతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను పెట్టుకునేలా ఆయా రాష్ట్రాలను ఒప్పించడంలో ఈ పర్యటన సత్ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల చైర్మన్లు, సీఈఓలతో సమావేశమైన మంత్రి కేటీఆర్.. వాటి విస్తరణ ప్రణాళికలను తెలుసుకున్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. సిలికాన్ వ్యాలీలో మంత్రి చేసిన ప్రసంగంతో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఆలోచనలు అక్కడి ప్రముఖ కంపెనీ ప్రతినిధులు, పెట్టుబడిదారులను ఆకర్షించాయి. ఐటీ, బయోటెక్నాలజీ, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్, క్లీన్ టెక్ రంగాల్లోని కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమావేశాలు జరిపారు.  అక్కడి టెక్నాలజీ పనితీరును తెలుసుకున్నామన్నారు. మొత్తంగా పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందన్న నమ్మకాన్ని కలిగించడంలో విజయవంతం అయ్యామని మంత్రి తారకరామారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement