అదే స్ఫూర్తి.. అదే దీప్తి | ys jagan mohan reddy Rajahmundry tour successful | Sakshi
Sakshi News home page

అదే స్ఫూర్తి.. అదే దీప్తి

Published Fri, Nov 15 2013 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

ys jagan mohan reddy Rajahmundry tour successful

సాక్షి ప్రతినిధి, కాకినాడ :తాత్కాలికంగా ధూళి అంటినా వజ్రం వజ్రమే. దాని వెలుగూ, విలువా ఎన్నటికీ తగ్గవు. అలాగే కుట్రలు, కుతంత్రాల కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు అన్యాయంగా నిర్బంధంలో ఉండాల్సి వచ్చినా- వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గల జనాదరణ, జనంపై ఆయన ప్రభావం అణుమాత్రం తగ్గలేదు. బుధ, గురువారాల్లో జిల్లాలో ఆయనపై పోటెత్తిన జ నాభిమానమే అందుకు నిదర్శనం. సమైక్యాంధ్ర పరిరక్షణకు  త్వరలో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ‘సమైక్యాంధ్ర శంఖారావం’ పేరిట పర్యటిస్తానన్న ఆయన ప్రకటనతో సమైక్యవాదుల్లో నిండిన ఉత్తేజమే అందుకు సాక్ష్యం.బుధవారం రాజమండ్రి కంబాలచెరువు సెంటర్‌లో దివంగత నేత జక్కంపూడి విగ్రహానికి నివాళులర్పించిన సందర్భంలో త్వరలో ‘సమైక్య శంఖారావం’ పేరిట  రాష్ట్రమంతటా పర్యటిస్తానని జగన్ చేసిన ప్రకటన సమైక్యాంధ్ర ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది.
 
కేంద్ర మంత్రుల బృందం విభజనకు సిఫార్సు చేసిన పక్షంలో తిరిగి ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్న సమైక్యవాదులకు జగన్ ప్రకటన కొండంత సై్థర్యాన్ని కలిగించింది. జగన్ రెండు రోజుల పర్యటన పూర్తిగా ప్రైవేటు కార్యక్రమాలకే పరిమితమైనా పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఇనుమడించింది. కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల కుట్ర రాజకీయాలతో ప్రజలకు దూరమైన జగన్ ఏడాదిన్నర తరువాత జరిపిన పర్యటనలో ఆద్యంతం ప్రజాభిమానం ఉప్పొంగడంతో పార్టీ నేతలకు ధైర్యాన్ని నింపింది. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జిల్లా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రే తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. కానీ మధురపూడి ఎయిర్‌పోర్టులో దిగింది మొదలు రాజమండ్రి చేరుకునే వరకు అడుగడుగునా జనవాహిని పరవళ్లు తొక్కడంతో జగన్ గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది.
 
అర్ధరాత్రి దాటినా తరగని అభిమానఝరి
బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కాకినాడలో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటికి చేరుకున్న జగన్ అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు అభిమానులు, ప్రజల మధ్యనే గడిపారు. చాలా కాలం తరువాత రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, న్యాయవాదులు, వైద్యులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు జగన్‌ను కలుసుకున్నారు. తమ సమస్యలను వివరించారు. ఆయనతో ఫొటోలు దిగి, కరచాలనంచేస్తూ సంబరపడ్డారు. తిరిగి గురువారం ఉదయం ఏడు గంటలకే జగన్ బసచేసిన చంద్రశేఖరరెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, అభిమానులు తరలివచ్చి ఆయనను కలవకుండా వెళ్లేది లేదని పట్టుబట్టారు. ఫలితంగా కాకినాడ నుంచి ఏడు గంటలకు బయలుదేరాలనుకున్న జగన్ ఎనిమిది గంటల వరకు బయలుదేరలేకపోయారు.
 
ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న అభిమాన నాయకుడు తిరిగి తమ మధ్యకు రావడం, చెరగని చిరునవ్వుతో ఆప్యాయంగా పేరుపేరునా పలకరించడంతో పార్టీ శ్రేణులు నూతనోత్తేజంతో కేరింతలు కొట్టాయి. కుట్రల ఫలితంగా జగన్ జైలులో ఉండటంతో పార్టీ నేతలకు దశ, దిశ నిర్దేశం కొరవడుతుందని ఇతరపక్షాలు భావించాయి. అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో అధికార, విపక్షాలు కుమ్మక్కు రాజకీయాలు జరిపినా పార్టీ జిల్లాలో పట్టు సాధించగలిగింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో.. జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం జిల్లాలో జరిపిన తొలి   పర్యటన విజయవంతం కావడంతో తూర్పు సెంటిమెంట్ రాష్ట్రమంతటా కొనసాగుతుందని పార్టీ జిల్లా నేతలు విశ్లేషిస్తున్నారు. 
 
జగన్ పర్యటన విజయవంతం : కుడుపూడి 
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం కావడం ఆయనపై నానాటికీ జనాదరణ పెరుగుతోందనడానికి నిదర్శనమని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. జగన్‌కు వీడ్కోలు పలికేందుకు గురువారం మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన  కుడుపూడి ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లా పర్యటనలో తమ నేతకు జనం అడుగడుగునా నీరాజనాలు పట్టారన్నారు. ప్రతి గ్రామంలో వేలాదిగా ప్రజలు తరలి వచ్చి తమ అభిమాన నేతతో కరచాలనం చేస్తే చాలని ఉర్రూతలూగారన్నారు. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు, కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నేతలు, జిల్లాలోని రాష్ట్ర స్థాయి నేతలు క్రమశిక్షణతో సైనికుల్లా కృషి చేశారని పేర్కొంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement