Rajahmundry tour
-
Rajahmundry: పింఛన్ల పెంపు వారోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు)
-
కొండంత పర్వానికి..గోరంత వరమే
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం నాటిపర్యటన వికలాంగ దినోత్సవం, పుష్కర పనులపై సమీక్ష, పుష్కరఘాట్ల పరిశీలన.. ఈ మూడు అంశాలపైనే కేంద్రీకృతమైంది. వికలాంగుల దినోత్సవంలో వారి సంక్షేమానికి వేల కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించిన బాబు ప్రతిష్టాత్మకమైన పుష్కర పనులకు నిధుల విషయంలో ‘అతి పొదుపు’ పాటించారని వివిధశాఖల అధికారులు, నేతలు పెదవి విరిచారు. సీఎం పరిశీలనకు వస్తారనుకుని కొన్ని గోదావరి ఘాట్ల వద్ద నిరీక్షించిన ఇసుక ర్యాంపుల నిర్వాహకులైన మహిళా సంఘాల వారు ఆయన రాకపోవడంతో నిరాశ చెందారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు మధురపూడి ఎయిర్‌పోర్టుకు వచ్చిన సీఎం సాయంత్రం 6 గంటలకు తిరిగి వెళ్లారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి పర్యటన నేతల హడావిడి, కార్యకర్తల హంగామా, పోలీసుల ఓవర్ యాక్షన్ మధ్య ముగిసింది. ఇక్కడి చెరుకూరి కళ్యాణమండపంలో బుధవారం నిర్వహించిన వికలాంగుల దినోత్సవంలో వారి సంక్షేమానికి రూ.రెండువేల కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించిన బాబు ప్రత్యేక డీఎస్సీ మాటేమిటని పదేపదే ప్రశ్నించిన వికలాంగ మహిళను చిరునవ్వే సమాధానంగా నిరాశపరిచారు.అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో విజయవాడలో నిర్వహించాలనుకుని రాజమండ్రిలో ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంతంపై తనకున్న అభిమానమే కారణమని గొప్పగా చెప్పుకునేందుకు సీఎం ప్రయత్నించారు. స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమశాఖ అధికారికంగా నిర్వహించిన ఈ సమావేశాన్ని చంద్రబాబు పొగడ్తల వేదికగా మార్చేయడం వేదికపై అధికారులను విస్మయానికి గురిచేసింది. గుంటూరుకు చెందిన అంధుడైన పీజీ విద్యార్థి సురేష్‌కుమార్ మితిమీరిన అభిమానంతో చేసిన సుదీర్ఘప్రసంగం సభికుల సహనాన్ని పరీక్షించించింది. ‘అందరి రక్తం గ్రూపు ‘ఎ’ పాజిటివ్, ‘బి’ పాజిటివ్ అని వస్తుంది. కానీ నా గ్రూపు ‘టీడీపీ’ అని వస్తుందని, 65 ఏళ్ల మంచి నాయకుడు బాబుకు తాను 25 ఏళ్ల మిసైల్ వంటి యువకుడినంటూ అతిశయోక్తులతో కీర్తిస్తుంటే కట్టడి చేయలేక నిర్వాహకులు దిక్కులు చూడాల్సి వచ్చింది. ఇక్కట్ల పాలైన వికలాంగులు సీఎం వస్తున్నారని ఉదయం ఏడుగంటలకే జిల్లా నలుమూలల నుంచి వికలాంగులను సభా ప్రాంగణానికి తరలించిన నిర్వాహకులు వారి అవసరాలను, సమస్యలను విస్మరించడం విమర్శలపాలైంది. వందలాది మందిని సుదూర ప్రాంతాల నుంచి తరలించి వారికి నాలుగు బిస్కెట్లతో సరిపెట్టడం వికలాంగులకు కన్నీరు మిగిల్చింది. పర్యటన ఆద్యంతం పోలీసుల ఓవర్‌యాక్షన్‌తో వికలాంగులు మొదలుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతల వరకు అడుగడుగునా అందరూ ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఆర్అండ్బి అతిథిగృహం వద్ద అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్లను, చివరకు దేవాదాయశాఖ కమిషనర్ అనురాధను సైతం అనుమతించకుండా పోలీసులు అతి చేశారు. సీఎం పుష్కరఘాట్లు, నాలుగో వంతెన, హేవ్‌లాక్ వంతెన, రోడ్‌కం రైలుబ్రిడ్జి, నల్లాచానల్, కోటిలింగాల రేవు...ఇలా అన్ని పరిశీలించి వెళతారన్నా చివరకు నామ్కేవాస్తేగా ఒక్క గౌతమఘాట్‌లో మాత్రమే దిగి మరెక్కడా ఆగకుండానే కారులో చూసుకుంటూ వెళ్లిపోయారు. సమయాభావంతో అలా చేయాల్సి వచ్చిందని నేతలు సర్ది చెప్పబోయారు. పనిలో పనిగా ఈ పర్యటనలో చంద్రబాబు డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాను టీడీపీలో చేర్చుకున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం గత కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నా బాబు సమక్షంలో రాజా టీడీపీ తీర్థం పుచ్చుకోగా, ఆ సమయానికి తోట పార్లమెంటు సమావేశాల్లో ఉండటం గమనార్హం. కాగా, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఆర్అండ్బి అతిథిగృహంలో చంద్రబాబును కలిసి వెళ్లడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి పొన్నాడ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పుష్కర నిధులపై నేతలు, అధికారుల పెదవి విరుపు పుష్కరాలపై పలు ఆదేశాలు జారీ చేసిన సీఎం నిధులకు ఢోకా లేదంటూనే వాటిపై నిర్దిష్టమైన ప్రకటన చేయకుండా వెళ్లిపోవడం నేతలు, అధికారులకు నిరాశను మిగిల్చింది. పుష్కర పనులకు మొదట రూ.750 కోట్లతో వేసిన అంచనాలను తరువాత రూ.520 కోట్లకు, తిరిగి రూ.260 కోట్లకు కుదించారు. ఆర్థిక మంత్రి యనమల ఇటీవల సమీక్షలో వంద కోట్లకే పరిమితం చేసి తొలి విడతలో రూ.30 కోట్లు విడుదల చేస్తామన్నారు. అప్పుడు యనమల చెప్పిన లెక్క ప్రకారమే ఇప్పుడు చంద్రబాబు పుష్కర సమీక్షలో రెండు జిల్లాలకూ కలిపి రూ.25 కోట్లకు (తూర్పునకు రూ.15 కోట్లు, పశ్చిమకు రూ.10 కోట్లు) అనుమతించడం ఏ మూలకు సరిపోతాయని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. అన్నవరం సహా పంచారామాల అభివృద్ధిని ప్రతినెలా సమీక్షించాలని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు నీతూప్రసాద్, భాస్కర్లను సీఎం ఆదేశించారు. రాజమండ్రిలో 24 గంటల విద్యుత్ సరఫరా, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, రూ.10 కోట్లతో రాజమండ్రి జైళ్ల శాఖ డీఐజీ కార్యాలయం వద్ద ఖాళీ స్థలంలో కన్వెన్షన్ సెంటర్, మార్చి నెలాఖరుకు నాలుగో వంతెన పూర్తి, ఏప్రిల్ కల్లా కాకినాడ-రాజమండ్రి కెనాల్ రోడ్డు విస్తరణ పూర్తి వంటి లక్ష్యాలను నిర్దేశించారు. -
నేడు మైసూరా రాక
అమలాపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఎన్నికల పరిశీల కుడు ఎంవీ మైసూరారెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ నేతలతో చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సిన పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఈ సమావేశం రాజమండ్రి జాంపేట లోని ఉమారామలింగేశ్వర కల్యాణ మంటపంలో ఉదయం పది గంటలకు జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి బుధవారం అమలాపురంలో తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ సీజీసీ సభ్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజామాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, అబ్జర్వర్ల్లు, రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, పట్టణ, మండల పార్టీ కన్వీనర్లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. -
అదే స్ఫూర్తి.. అదే దీప్తి
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తాత్కాలికంగా ధూళి అంటినా వజ్రం వజ్రమే. దాని వెలుగూ, విలువా ఎన్నటికీ తగ్గవు. అలాగే కుట్రలు, కుతంత్రాల కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు అన్యాయంగా నిర్బంధంలో ఉండాల్సి వచ్చినా- వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి గల జనాదరణ, జనంపై ఆయన ప్రభావం అణుమాత్రం తగ్గలేదు. బుధ, గురువారాల్లో జిల్లాలో ఆయనపై పోటెత్తిన జ నాభిమానమే అందుకు నిదర్శనం. సమైక్యాంధ్ర పరిరక్షణకు త్వరలో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ‘సమైక్యాంధ్ర శంఖారావం’ పేరిట పర్యటిస్తానన్న ఆయన ప్రకటనతో సమైక్యవాదుల్లో నిండిన ఉత్తేజమే అందుకు సాక్ష్యం.బుధవారం రాజమండ్రి కంబాలచెరువు సెంటర్లో దివంగత నేత జక్కంపూడి విగ్రహానికి నివాళులర్పించిన సందర్భంలో త్వరలో ‘సమైక్య శంఖారావం’ పేరిట రాష్ట్రమంతటా పర్యటిస్తానని జగన్ చేసిన ప్రకటన సమైక్యాంధ్ర ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. కేంద్ర మంత్రుల బృందం విభజనకు సిఫార్సు చేసిన పక్షంలో తిరిగి ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్న సమైక్యవాదులకు జగన్ ప్రకటన కొండంత సై్థర్యాన్ని కలిగించింది. జగన్ రెండు రోజుల పర్యటన పూర్తిగా ప్రైవేటు కార్యక్రమాలకే పరిమితమైనా పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఇనుమడించింది. కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల కుట్ర రాజకీయాలతో ప్రజలకు దూరమైన జగన్ ఏడాదిన్నర తరువాత జరిపిన పర్యటనలో ఆద్యంతం ప్రజాభిమానం ఉప్పొంగడంతో పార్టీ నేతలకు ధైర్యాన్ని నింపింది. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జిల్లా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రే తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. కానీ మధురపూడి ఎయిర్‌పోర్టులో దిగింది మొదలు రాజమండ్రి చేరుకునే వరకు అడుగడుగునా జనవాహిని పరవళ్లు తొక్కడంతో జగన్ గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. అర్ధరాత్రి దాటినా తరగని అభిమానఝరి బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కాకినాడలో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటికి చేరుకున్న జగన్ అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు అభిమానులు, ప్రజల మధ్యనే గడిపారు. చాలా కాలం తరువాత రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, న్యాయవాదులు, వైద్యులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు జగన్‌ను కలుసుకున్నారు. తమ సమస్యలను వివరించారు. ఆయనతో ఫొటోలు దిగి, కరచాలనంచేస్తూ సంబరపడ్డారు. తిరిగి గురువారం ఉదయం ఏడు గంటలకే జగన్ బసచేసిన చంద్రశేఖరరెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, అభిమానులు తరలివచ్చి ఆయనను కలవకుండా వెళ్లేది లేదని పట్టుబట్టారు. ఫలితంగా కాకినాడ నుంచి ఏడు గంటలకు బయలుదేరాలనుకున్న జగన్ ఎనిమిది గంటల వరకు బయలుదేరలేకపోయారు. ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న అభిమాన నాయకుడు తిరిగి తమ మధ్యకు రావడం, చెరగని చిరునవ్వుతో ఆప్యాయంగా పేరుపేరునా పలకరించడంతో పార్టీ శ్రేణులు నూతనోత్తేజంతో కేరింతలు కొట్టాయి. కుట్రల ఫలితంగా జగన్ జైలులో ఉండటంతో పార్టీ నేతలకు దశ, దిశ నిర్దేశం కొరవడుతుందని ఇతరపక్షాలు భావించాయి. అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో అధికార, విపక్షాలు కుమ్మక్కు రాజకీయాలు జరిపినా పార్టీ జిల్లాలో పట్టు సాధించగలిగింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో.. జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం జిల్లాలో జరిపిన తొలి పర్యటన విజయవంతం కావడంతో తూర్పు సెంటిమెంట్ రాష్ట్రమంతటా కొనసాగుతుందని పార్టీ జిల్లా నేతలు విశ్లేషిస్తున్నారు. జగన్ పర్యటన విజయవంతం : కుడుపూడి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం కావడం ఆయనపై నానాటికీ జనాదరణ పెరుగుతోందనడానికి నిదర్శనమని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అన్నారు. జగన్‌కు వీడ్కోలు పలికేందుకు గురువారం మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన కుడుపూడి ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లా పర్యటనలో తమ నేతకు జనం అడుగడుగునా నీరాజనాలు పట్టారన్నారు. ప్రతి గ్రామంలో వేలాదిగా ప్రజలు తరలి వచ్చి తమ అభిమాన నేతతో కరచాలనం చేస్తే చాలని ఉర్రూతలూగారన్నారు. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు, కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నేతలు, జిల్లాలోని రాష్ట్ర స్థాయి నేతలు క్రమశిక్షణతో సైనికుల్లా కృషి చేశారని పేర్కొంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.