
నేడు మైసూరా రాక
అమలాపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఎన్నికల పరిశీల కుడు ఎంవీ మైసూరారెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ నేతలతో చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సిన పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఈ సమావేశం రాజమండ్రి జాంపేట లోని ఉమారామలింగేశ్వర కల్యాణ మంటపంలో ఉదయం పది గంటలకు జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి బుధవారం అమలాపురంలో తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ సీజీసీ సభ్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజామాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, అబ్జర్వర్ల్లు, రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, పట్టణ, మండల పార్టీ కన్వీనర్లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.