mysoora reddy
-
శంకుస్ధాపనకు ఇంత ఖర్చు అనవసరం
-
కేసు వల్లే కృష్ణాజలాల సాధనలో రాజీ పడ్డారా?
కృష్ణా జలాలను సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం రాజీ పడినట్లు కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి మండిపడ్డారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడటంలో బాబు సర్కారు విఫలం అయ్యిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా కాపాడుకున్న ఏపీ హక్కులను కాస్తా కృష్ణార్పణం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర, కృష్ణా జలాల హక్కులను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈనెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తామని మైసూరారెడ్డి చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడం వల్లే కృష్ణాజలాలు సాధించడంలో చంద్రబాబు రాజీ పడినట్లు కనిపిస్తోందని ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులు కాలరాయడం అన్యాయమని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడానికి చంద్రబాబు సిద్ధం అవుతున్నారని మైసూరా ఆరోపించారు. -
’కేసు వల్లే కృష్ణాజలాల సాధనలో రాజీ పడ్డారా?’
-
చంద్రబాబు రాజీనామా చేయాలి:మైసూరారెడ్డి
-
'సమైక్య ఆంధ్ర సీఎం అన్నట్లు వ్యవహారిస్తున్నాడు'
-
ఆ పాపం ఇద్దరిదీ : మైసూరారెడ్డి
టీ, ఏపీ ప్రభుత్వాలపై మైసూరా ధ్వజం సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పడిపోవడంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాపమూ ఉందని మైసూరారెడ్డి శుక్రవారం దుయ్యబట్టారు. రాయలసీమకు కేటారుుంచిన నికర జ లాలు వచ్చేలా చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే రాయలసీమకు నీటి విడుదల సాధ్యం కాదని తెలిసీ.. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 నుంచి 860 అడుగులకు పడిపోయేంతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేసిందని చెప్పారు. రాయలసీమ పేరుతో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతున్న మాటలన్నీ చిత్తశుద్ధి లేనివేనని మైసూరారెడ్డి విమర్శించారు. రేపు ప్రాజెక్టు సందర్శన వాస్తవాలు బహిర్గతం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టు సందర్శనకు వెళుతుందని మైసూరారెడ్డి చెప్పారు. -
నవంబర్ 1నే రాష్ట్రావతరణ వేడుకలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర సాధనకు అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నవంబర్ ఒకటవ తేదీన నిర్వహించడమే సముచితమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రావతరణ వేడుకలు జూన్ 2న నిర్వహించాలని నిర్ణయించడం దురదృష్టకరమని, దీనిని పార్టీ ఖండిస్తోందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. తమ పార్టీ రాష్ట్రావతరణ వేడుకలను నవంబర్ ఒకటవ తేదీనే జరుపుకుంటుందని చెప్పారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ వేరుపడినప్పటికీ మధ్యప్రదేశ్ అంతకు మునుపు జరుపుకునే తేదీనే రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటుందని చెప్పారు. జార్ఖండ్ నుంచి వేరు పడిన బీహార్, ఉత్తరాఖండ్ నుంచి వేరుపడిన ఉత్తరప్రదేశ్ అంతకుముందు జరుపుకున్న తేదీలనే రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటున్నాయని తెలిపారు. ఈ సంప్రదాయాలనే ఏపీ పాటించాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం జూన్ రెండో తేదీన రాష్ట్రావతరణ వేడుకలు జరపాలన్న నిర్ణయం చేయడమంటే వారు రాష్ట్ర విభజనకు అంగీకరించారని భావించాలన్నారు. సమైక్యంగా ఉండాలని కోరుకున్న తమ పార్టీ కేంద్ర, జిల్లా కార్యాలయాల్లో శనివారం రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటామని చెప్పారు. నేడు వేడుకలో జగన్మోహన్రెడ్డి హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించే రాష్ట్రావతరణ వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని పార్టీ తెలియజేసింది. కేబినెట్ నిర్ణయం సరికాదు: లక్ష్మణ్ రెడ్డి ఏపీ అవతరణ దినోత్సవం జూన్ 2న నిర్వహిం చాలని మంత్రి మండలి నిర్ణయించటం సరికాదని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఆమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 2 అనేది ఒక దుర్దినమన్నారు. గతంలో లాగా నవంబర్1న నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంత్రి మండలి నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం దీన్ని పునఃసమీక్షించాలన్నారు. జూన్ 2 నిర్ణయం ఉపసంహరించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న కాకుండా తెలంగాణ ఏర్పడిన జూన్ 2న నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించడం పట్ల ఆంధ్రా మేధావుల, విద్యావంతుల వేదిక తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీన్ని భావ దారిద్య్రంగా వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చలసాని శ్రీనివాస్, పీఎస్ఎన్ మూర్తి, కార్యదర్శి టి. నరసింహారావు విమర్శించారు. ‘మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లను చీల్చి ఇతర రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఈ మాతృ రాష్ట్రాలేవీ కొత్తగా చీలిన దినాలను అవతరణ దినోత్సవాలుగా మార్చుకోలేదు. నవంబర్ 1ని మార్చాలనుకుంటే అమరజీవి పొట్టి శ్రీరాములుతోపాటు 1913 నుంచి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరు సల్పి సాధించుకున్న అక్టోబర్ 1ని ఏపీ అవతరణ దినోత్సవంగా ప్రకటించాల్సింది. సీమాం ధ్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర విభజనను ప్రజలు నిరసించారు. సీఎం వాస్తవాలు గమనించి ప్రకటనను ఉపసంహరించుకోవాలి’ అని డిమాండు చేసింది. -
రేపే వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో ఏపీ అవతరణ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవంబర్ ఒకటో తేదీనే నిర్వహించనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు.. జిల్లా కార్యాలయాల్లో కూడా నవంబర్ ఒకటో తేదీనే రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది తప్ప.. తెలంగాణ నుంచి ఏపీ విడిపోలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర అవతరణ వేడుకలను జూన్ రెండో తేదీ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఆయన చెప్పారు. గతంలో ఏర్పడిన రాష్ట్రాలు పాటిస్తున్న సంప్రదాయాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. -
'ఏపీ, తెలంగాణ వైఖరితో రాయలసీమకు అన్యాయం'
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ కలిసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సీనియర్ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోయినా ఆంధ్రప్రదేశ్ సర్కారు చూస్తూ ఊరుకుందని, ఇప్పుడు మాత్రం రాజకీయ పబ్బం గడుపుకోడానికి కంటితుడుపు చర్యగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. రాయలసీమకు జరిగిన అన్యాయంలో ప్రధానపాత్ర టీడీపీదేనని ఆయన విమర్శించారు. రాయలసీమ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎల్లుండి శ్రీశైలం రిజర్వాయర్‌ను సందర్శిస్తారని మైసూరారెడ్డి చెప్పారు. నవంబర్ 1న తమ పార్టీ ఏపీ అవతరణ వేడుకలను నిర్వహిస్తుందని మైసూరా రెడ్డి తెలిపారు. 1న వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం, జిల్లా కార్యాలయాల్లో వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది కానీ తెలంగాణ నుంచి ఏపీ విడిపోలేదని అన్నారు. నవంబర్ 1న అవతరణ వేడుకలు చేసుకోవడమే సమంజసమని మైసూరా రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అవతరణ వేడుకలు జూన్ 2న నిర్వహించాలని నిర్ణయించడం దురృష్టకరమని అన్నారు. -
భూములకు రెక్కలొచ్చేలా చేస్తుంది మీరు కాదా?
-
ప్రభుత్వ భూములున్న చోటే రాజధాని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలవారికి ఆమోదయోగ్యంగా ఉండేలా రాజధానిని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎంవీ మైసూరా రెడ్డి అన్నారు. రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీని పాలకులు ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. శివరామకృష్ణన్ కమిటీ ఉండగానే చంద్రబాబు సలహా కమిటీని ఏర్పాటు చేయడం వెనుక అంతర్యమేమిటని మైసూరా రెడ్డి ప్రశ్నించారు. సలహా కమిటీలో ఉన్నవారు సాంకేతిక నిపుణులా అని నిలదీశారు. ప్రభుత్వ భూమి ఉన్న చోట రాజధాని ఏర్పాటు చేయాలని సూచించారు. మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాలని చెప్పారు. ప్రైవేటు భూములు ఉన్న చోట సింగపూర్, జయపుత్ర తరహా రాజధానిని నిర్మించడం కష్టమని మైసూరా రెడ్డి పేర్కొన్నారు. -
కర్నూలు జెడ్పీ ఎన్నికను కోర్టులో సవాల్ చేస్తాం
హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డితో వైఎస్ఆర్ సీపీ ప్రతినిధుల బృందం బుధవారం భేటీ అయ్యింది. పలు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణలో అధికార పార్టీకి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఈసీని కోరారు. భేటీ అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి మాట్లాడుతూ కర్నూలు, నెల్లూరు, ప్రకాశం కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రభుత్వం ఆదేశాలు అమలుకే అధికారులు పరిమితం అయ్యారన్నారు. నిష్పక్షికంగా వ్యవహరించాలన్న కనీస ఇంగిత జ్ఞానం మరిచి వ్యవహరించారన్నారు. అధికార పార్టీకి సహకరించిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్‌ను కోరామని మైసూరారెడ్డి తెలిపారు. కర్నూలు జెడ్పీ ఛైర్మన్ ఎన్నికను కోర్టులో సవాల్ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖను అందచేసామని మైసూరా తెలిపారు. -
'ప్రజలు తిరుగుబాటు చేస్తారని మీకు భయమా?'
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం కోసం టీడీపీ నేతలు నైతిక విలువలు దిగజారి వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మైసూరా రెడ్డి, అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసే విప్ నూటికి నూరుశాతం చెల్లుతుందని అంబటి అన్నారు. టీడీపీ నేతలు నిస్సిగ్గుగా బరితెగించి వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకిచ్చిన వాగ్దానాలను ముందు అమలుచేయాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అంబటి హితవు పలికారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న భయం మిమ్మల్ని వెంటాడుతోందా అని అంబటి ప్రశ్నించారు. ఫిరాయింపులు ప్రోత్సహించడం మానుకోకుంటే ప్రజలే తగిన బుద్ధిచెప్తారని మీడియాలో సమావేశంలో వైఎస్ఆర్ సీపీ నేతలు మైసూరా రెడ్డి, అంబటి రాంబాబులు హెచ్చరించారు. -
టీడీపీ పనులు అనైతికం
హైదరాబాద్: ఒక పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులను టీడీపీ చేర్చుకోవడం దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంవీ మైసూరా రెడ్డి విమర్శించారు. టీడీపీ చేస్తున్న పనులు నైతిక విలువలకు విరుద్ధమని అన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వారిని తమ పార్టీలోకి చేర్చుకోవడం దురదృష్టకరమని అన్నారు. పార్టీ వీడే వారందరికీ విప్ వర్తిస్తుంది మైసూరా రెడ్డి చెప్పారు. ఒకరిద్దరూ వెళ్లిపోయారని, ఇక ఎవరూ పార్టీని వీడరని స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం చూపిస్తున్నాయని మైసూరా రెడ్డి విమర్శించారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 140 స్థానాలు
జగన్ సీఎం అవడం ఖాయం: మైసూరారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ 25 లోక్‌సభ స్థానాలను, కనీసం 140 అసెంబ్లీ సీట్లను గెల్చుకుంటుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ నేతలు పి.ఎన్.వి.ప్రసాద్, కె.శివకుమార్, చల్లా మధుసూదనరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలు చారిత్రకమైనవని, పోలింగ్ సరళినిబట్టి రాష్ట్రవ్యాప్తంగా జగన్ పవనాలు వీస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని చెప్పా రు. టీడీపీ నేతలు జనంలోకి వెళ్లినా వారికి స్పందన కరవైం దని, అందుకే చేతులెత్తేసి ఎన్నికల కమిషన్ అధికారులతో వాదులాటకు దిగుతున్నారని, వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతల తీరునుబట్టే వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు ఖాయమైందనే విషయం వెల్లడవుతోందన్నారు. 25 లోక్‌సభ స్థానాలను గెల్చుకుని కేంద్రంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ చక్రం తిప్పుతుందని చెప్పారు. పోలింగ్ సరళితో చేతులెత్తేసిన టీడీపీ: గట్టు సాక్షి, హైదరాబాద్: పోలింగ్ సరళి చూసిన తర్వాత టీడీపీ చేతులెత్తేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఓటమిని ముందే అంగీకరించిన ఆ పార్టీ నాయకులు ముఖం చాటేశారన్నారు. ఓటమికి గల కారణాలను బీజేపీ, పవన్‌కల్యాణ్‌పై నెట్టే పనిలో చంద్రబాబు నిమగ్నమై ఉన్నారని గట్టు ఎద్దేవా చేశారు. ఓటమి తప్పదని తీవ్ర ఒత్తిడికి లోనైన టీడీపీ నేతలు ఆఖరికి ఎన్నికల అధికారులపై దుర్భాషలాడుతూ దాడులకు దిగారన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఈసీ పట్ల వ్యవహరించిన తీరును స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తీవ్రంగా తప్పుబట్టడాన్ని చూస్తే వారి నైజం బయటపడిందన్నారు. ఓటమిని ఒప్పుకున్న టీడీపీ: వాసిరెడ్డి పద్మ సాక్షి, హైదరాబాద్: పోలింగ్ పూర్తవకముందే టీడీపీ ఓటమిని అంగీకరించిందని, అందువల్లే వైఎస్సార్ కాంగ్రెస్‌పై ఎల్లో మీడియా ద్వారా పోలింగ్ రోజున కూడా దుష్ర్పచారం చేయించిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. -
ఎన్డీఏ సభలు.. తోలు బొమ్మలాటలు
హైదరాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంవీ మైసూరా రెడ్డి విరుచుకుపడ్డారు. ఎన్డీఏ నిర్వహించిన విజయశంఖారావం సభలు తోలు బొమ్మలాటల్ని గుర్తుకు తెస్తున్నాయని విమర్శించారు. టీడీపీ చేసిన కుమ్మక్కు రాజకీయాల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన నిర్వాకం వల్లే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుందని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక 194వ పేజీలో పేర్కొందని మైసూరారెడ్డి గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన నామరూపాల్లేని పార్టీ అని, పరిటాల రవి గుండు కొట్టించినప్పుడు పవన్ పౌరుషం ఏమైందని మైసూరా రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యర్థి పార్టీలపై అవాకులు, చవాకులు పేలడం తప్ప ఏ రోజైనా ప్రజాసమస్యలపై పవన్ పోరాడాడా అని నిలదీశారు. ప్రజలకు ఏం చేశాడని పవన్ జనాన్ని ఓట్లడుగుతున్నాడని మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు సినిమా డైలాగులుగా పనికొస్తాయి కానీ ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదని మైసూరారెడ్డి విమర్శించారు. -
నేడు మైసూరా రాక
అమలాపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఎన్నికల పరిశీల కుడు ఎంవీ మైసూరారెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ నేతలతో చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సిన పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఈ సమావేశం రాజమండ్రి జాంపేట లోని ఉమారామలింగేశ్వర కల్యాణ మంటపంలో ఉదయం పది గంటలకు జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి బుధవారం అమలాపురంలో తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ సీజీసీ సభ్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజామాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, అబ్జర్వర్ల్లు, రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, పట్టణ, మండల పార్టీ కన్వీనర్లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. -
'తెలుగు ప్రజల బతుకుల్ని కాంగ్రెస్ ఛిద్రం చేసింది'
రెండుసార్లు అధికారమిస్తే కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల బతుకుల్ని ఛిద్రం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉంది అని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గవర్నర్ పాలనకు కేంద్రం సిఫార్సు చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలుగువారి మధ్య చిచ్చుపెట్టి ఇప్పుడు ప్యాకేజీల పేరుతో రకరకాల ప్రకటనలు చేస్తున్నారని మైసూరా విమర్శించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తుడిసిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. సోనియా పెట్టె, బేడా సర్దుకొని కొడుకుతో సహా ఇటలీకి పోయే దుస్థితి రాబోతుందని మైసూరారెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ మద్దతు వల్లే కాంగ్రెస్ పాలన ఇన్నాళ్లు సాగిందని, లేకపోతే ఎప్పుడో కూలిపోవాల్సిన ప్రభుత్వమిదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ నుంచి చాలామంది ఆసక్తి చూపారని.. అయితే ఖాళీ లేకనే టీడీపీలోకి వెళ్తున్నారని మైసూరారెడ్డి అన్నారు. చంద్రబాబు మాటల్ని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మైసూరారెడ్డి అన్నారు. -
'అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదు'
హైదరాబాద్:లోక్‌సభలో వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి తెలిపారు. కావాలనే టీడీపీ నేతలు దగుల్బాజీ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.అవిశ్వాసానికి అవసరమైన మద్దతుకోసం కాంగ్రెస్-టీడీపీలు ఏరోజూ ప్రయత్నించలేదన్నారు. లోక్‌పాల్ బిల్లుకోసం అవిశ్వాసాన్ని వాయిదా వేయమని కోరామే తప్పా..ఉపసంహరించుకోలేదని మైసూరా తెలిపారు. టీడీపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులని విమర్శించారు.టీడీపీ చేస్తున్న సిగ్గులేని రాజకీయాలను చేసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. -
రాజ్యాంగ సవరణతోనే రాష్ట్రాలకు రక్ష
ఆర్టికల్ 3ని వక్రీకరించి రాష్ట్ర విభజన వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి ధ్వజం హైదరాబాద్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ఎమ్మెల్యేలను సామ, దాన, దండోపాయాలతో విభజన బిల్లుకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని వక్రీకరించి ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర విభజన ప్రక్రియ-సమాఖ్య స్ఫూర్తి’ అనే అంశంపై శనివారం మహాసభ కార్యాలయంలో జరిగిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనతో, కాస్తో కూస్తో మిగిలి ఉన్న సమాఖ్య స్ఫూర్తిని ఢిల్లీ పెద్దలు కాలరాస్తున్నారన్నారు. స్పీకర్‌కు కూడా ఢిల్లీ నుంచే ఆదేశాలు, తాయిలాలు అందుతున్నాయని ఆరోపించారు. ఒక ప్రాతిపదిక లేకుండా.. కమిటీ, కమిషన్ ఏదీ చర్చించకుండా విభజన చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుపై ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని సవరించడం దేశ సమగ్రతకు ఎంతో అవసరమని చెప్పారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభలోగానీ, పార్లమెంట్లో గానీ కనీసం మూడింట రెండొంతుల మెజార్టీతోనే రాష్ట్రాల పునర్విభజన జరిగేలా రాజ్యాంగాన్ని సవరించాలని సూచించారు. లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఐపీఎస్ అధికారి సి.ఆంజనేయరెడ్డి ఎన్.తులసిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.నర్సింహారావు, కె.రవీంద్ర, పి.రామజోగయ్య, కె. నారాయణరావు, ఎ.మురళి, సయ్యద్ జాఫ్రీ, వీవీ కృష్ణారావు, విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులురవితేజ, చక్రవర్తి ఇందులో పాల్గొన్నారు. -
అధికారమున్నా.. ఉచిత సలహాలా!
అఖిలపక్షంతో ప్రధాని వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి అసంతృప్తి ట్రిబ్యునళ్ల వల్ల జరిగే అన్యాయాలపై చట్టం తేవచ్చని ప్రధానికి తెలియకపోవడం మనకు శాపం కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ చేసిన అన్యాయంపై అఖిలపక్షాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు తీసుకెళ్లింది ఆయన నుంచి ఉచిత సలహా తీసుకోవడం కోసమా? అని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ప్రశ్నించారు. ట్రిబ్యునల్ తీర్పు వల్ల తమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఢిల్లీలో అఖిలపక్షం నివేదిస్తే అన్నీ విన్న ప్రధాని, ‘మీ మాటల్లో సారాంశం ఉంది.. సుప్రీంకోర్టుకు వెళ్లి గట్టిగా వాదించండి..’ అని చెప్పారన్నారు. ‘ఈ సలహా కోసమేనా ఆయన వద్దకు సీఎం కిరణ్ అన్ని రాజకీయ పక్షాలను తీసుకెళ్లింది? ఎందుకు వెళ్లారు.. ఎందుకు వచ్చారు? అక్కడ చేసిందేమిటో... అంతా అయోమయంగా ఉంది’ అని విమర్శించారు. ప్రధాని తనకు ఉన్న అధికారాలను కూడా మరిచి ఈ సందర్భంలో మాట్లాడారన్నారు. రాజ్యాంగంలోని 262 అధికరణ కింద ఇలాంటి ట్రిబ్యునళ్లు, విచారణ సంస్థల వల్ల ఏదైనా రాష్ట్రానికి అన్యాయం జరిగినట్లు భావిస్తే వాటిని సరిచేసేందుకు పార్లమెంటులో చట్టం తీసుకురావచ్చని ప్రధానికి తెలియకపోవడం మన రాష్ట్రానికి శాపంగా ఉందన్నారు. సీఎం ప్రజలను మభ్యపెడుతూ కేంద్రానికి సహకరించేందుకే అఖిలపక్షం డ్రామాను నడిపించారని, ఆయన ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని మండిపడ్డారు. స్టార్ బ్యాట్స్‌మెన్ అని చెప్పుకుంటూ రాష్ట్ర విభజనను ఆపుతానని ప్రగల్భాలు పలికిన కిరణ్ రాష్ట్రపతి నుంచి బిల్లు వచ్చిన పది గంటల్లోపే అసెంబ్లీకి పంపి తన నైజాన్ని చాటుకున్నారన్నారు. ఇపుడు అఖిలపక్షం విషయంలో కూడా ఇలాగే చేశారన్నారు. అశోక్‌బాబు అందరినీ ఒకేగాట కట్టేస్తే ఎలా? రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గట్టిగా కోరుకుంటున్న వైఎస్సార్ సీపీని, విభజనకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలను ఒకే గాటన కట్టేయడం ఏ మాత్రం సరికాదని మైసూరా అన్నారు. ఎన్జీవోల నేత అశోక్‌బాబు వైఎస్సార్సీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించినపుడు.. విభజనకు నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్, విభజనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెబుతున్నది చంద్రబాబు, అలాంటపుడు సమైక్యం కోరుకుంటున్న వైఎస్సార్ సీపీ వారితో ఎలా వేదికను పంచుకుంటుందని ఆయన ప్రశ్నించారు. సోనియాగాంధీ, చంద్రబాబు విభజన విషయంలో వారి విధానం మార్చుకున్నారా? అశోక్‌బాబు వీరితో ఏమైనా మాట్లాడారా? అని మైసూరా అన్నారు. తాను చెప్పిందే పార్టీ విధానం, తాను విభజనకే కట్టుబడి ఉన్నానన్న చంద్రబాబును ఉటంకిస్తూ ఒక పత్రికలో ప్రచురితమైన వార్తను మైసూరా చూపిస్తూ.. ఆ పార్టీకి చెందిన ఎవరైనా నాయకులు సమైక్య ఉద్యమంలో పాల్గొన్నంత మాత్రాన పార్టీ విధానంలో మార్పు వచ్చినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. సమైక్యం కోసం సమావేశం నిర్వహిస్తున్నపుడు అందులో పాల్గొనడానికి వచ్చే ముందు ఆయా పార్టీలు సమైక్యానికి అనుకూలమనే విధానం ప్రకటించాలని అశోక్‌బాబు షరతు విధించాల్సిందని అన్నారు. ఎన్జీవోలతో తమ పార్టీకి ఎలాంటి విభేదాలు లేవని, వారి ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవని చెప్పారు. -
సమైక్య తీర్మానాన్ని అనుమతించాలి
వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేయాలని 77వ నిబంధన కింద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసును స్పీకర్ శాసనసభలో అనుమతించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. ఆ తీర్మానంపై చర్చ జరిగాక ఓటింగ్ నిర్వహించి, వచ్చే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసు నిబంధనలకు లోబడే ఉంది కనుక స్పీకర్ ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే నిబంధన కింద ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా తీర్మానానికి నోటీసు ఇచ్చినట్లు తమకు సమాచారం ఉందని, అందువల్ల వారంతా తమ అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసి సమైక్య తీర్మానం నెగ్గేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి కూడా అసెంబ్లీకి విభజన బిల్లును పంపుతూ విడివిడిగా ఎమ్మెల్యేల అభిప్రాయంతో పాటు శాసనసభ అభిప్రాయం కూడా తెలియజేయాలని లేఖ రాశారని తెలిపారు. ఇది పార్లమెంటులో పెట్టే బిల్లు కనుక విప్ జారీచేయడం అనేది ఉండదని, అందువల్ల ఎమ్మెల్యేలందరూ తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించాలన్నారు. రాజ్యాంగం, నిబంధనల ప్రకారం స్పీకర్ చిత్తశుద్ధితో ఎమ్మెల్యేల అభిప్రాయంతో పాటు శాసనసభ అభిప్రాయాన్ని కూడా రాష్ట్రపతికి పంపాలని మైసూరా సూచించారు. కేంద్రం వంకర టింకరగా అధికారాన్ని, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని, అయితే స్పీకర్ మాత్రం సంప్రదాయాలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇది చరిత్రాత్మకమైన బిల్లు కాబట్టి తగిన సమయం ఇచ్చి ఎమ్మెల్యేలంతా అవగాహనతో చర్చించడానికి వీలుగా శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి... ‘‘రాష్ట్రపతి నుంచి గురువారం రాత్రి 7 గంటలకు యుద్ధ విమానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బిల్లు వస్తే, రాత్రికి రాత్రి నలుగురు శాఖాధిపతులు పరిశీలించి సంతకాలు చేయడం.. ముఖ్యమంత్రికి పంపడం.. ఆయన దానిని గవర్నర్‌కు పంపడం.. అక్కడి నుంచి మళ్లీ ముఖ్యమంత్రికి రావడం.. అలా తనకు వచ్చిన విభజన బిల్లును సీఎం కిరణ్ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్‌కు పంపడం.. ఇవన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి. సాధారణంగా ఈ తంతుకు కనీసం నాలుగైదు రోజులు పడుతుంది. అలాంటిది నిద్రపోయే సమయం మినహాయిస్తే పది గంటల్లోనే రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు అసెంబ్లీకి చేరింది. సమైక్యవాదం ముసుగులో ఉన్న కిరణ్ ఇలా ఎందుకు చేసినట్లు? ఓవైపు సమైక్యవాదినని చెబుతూ మరో వైపు ఇలా బిల్లుకు సహాయ సహకారాలు అందించడం ఏమిటి? అధిష్టానం చెప్పినందువల్లే కిరణ్ ఇలా చేస్తున్నారా? లేక దిగ్విజయ్ ఆయన మెడపై కత్తి పెట్టి ఇలా చేయించారా’’ అని మైసూరారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజన బిల్లు తనకు వచ్చినపుడు దానిపై ఆయన రాసిన ‘నోట్ ఫైల్’ వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పైకి సమైక్యవాదినని చెప్పుకుంటూ కిరణ్ ప్రజలను ఇలా మభ్యపెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఏదైనా అంశం కేంద్రం నుంచి వస్తే తొలుత సంబంధిత శాఖ కార్యదర్శికి, అక్కడి నుంచి మంత్రికి ఆ తర్వాత ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రికి చేరుతుందని.. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదని విమర్శించారు. ‘‘కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన కార్యదర్శి స్థాయి అధికారి.. ప్రధాన కార్యదర్శికి, గవర్నర్‌కు ఇలా బిల్లు పంచుకుంటూ ఎలా వెళ్తారు? ఇదేమైనా పాలెగాళ్ల రాజ్యమా.. ఇంత అప్రజాస్వామికమా’’ అని ప్రశ్నించారు. సచివాలయం పనివేళలు సాయంత్రం 5 గంటలకే ముగిసినా ప్రధాన కార్యదర్శి ఆ తరువాత ఈ తంతు ఎలా నడుపుతారన్నారు. కేంద్రం ఒత్తిళ్లకు లొంగి ఇలా వ్యవహరించడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, సర్వీసు రూల్స్‌కు కూడా వ్యతిరేకమని తెలిపారు. కాగా, సొంతంగా ఎన్నికలు ఎదుర్కొనే శక్తి లేనందువల్లే టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారని మైసూరా ఎద్దేవా చేశారు. -
అన్ని పార్టీలూ ఆలోచిస్తున్నాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్ ముందుకొస్తే ఆయా రాజకీయ పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తాయనే విశ్వాసం తమకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వ క్షుద్ర రాజకీయాలను జాతీయస్థాయిలో ఆయా రాజకీయ పార్టీల దృష్టికి తెచ్చి వారి మద్దతు కూడగట్టడంలో జగన్మోహన్రెడ్డి కృతకృత్యులయ్యారని చెప్పారు. మంగళవారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత కొద్దిరోజులుగా జగన్ నేతృత్వంలోని తమ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి ప్రణ బ్ ముఖర్జీని, వామపక్షాలను, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ), బీజేడీ, ఎన్సీపీ, శివసేన పార్టీల నాయకులను కలుసుకుందన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండానే నిరంకుశంగా రాష్ట్ర విభజన చేస్తున్న విషయంతో పాటు రాజ్యాంగంలోని 3వ అధికరణను ఎలా దుర్వినియోగం చేస్తోందో జగన్ వివిధ పక్షాల నేతలకు వివరించారన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను విభజించి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినపుడు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల నుంచి తీర్మానం తీసుకున్నారని, అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చినపుడు అలాంటి సంప్రదాయాన్ని పాటించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని జగన్ వారి దృష్టికి తెచ్చారన్నారు. ఇదేదో కాంగ్రెస్ సొంతింటి వ్యవహారం మాదిరిగా చేయడం అప్రజాస్వామికం అని చెప్పారని తెలిపారు. తమ పార్టీ వాదనతో అన్ని పక్షాలూ ఏకీభవించాయని, తప్పకుండా పార్లమెంటులో ఈ విషయం చెబుతామని వారు హామీ ఇచ్చారని అన్నారు. వైఎ స్సార్ కాంగ్రెస్ చేసిన ఈ ప్రయత్నాల వల్ల తప్పకుండా ఆయా పక్షాలు పార్లమెంటులో విభజన బిల్లు వస్తే వ్యతిరేకిస్తాయనే నమ్మకం కలుగుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), డీఎంకే, ఏడీఎంకే అధినేతలను కూడా జగన్మోహన్రెడ్డి కలిసి పరిస్థితులను వివరిస్తారన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదన అత్యంత దుర్మార్గమైందని, రాజకీయ లబ్ధి కోసం ఎంత పతనస్థాయికి దిగజారుతారనేది దీన్ని బట్టి అర్థం అవుతోందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
'ఆర్టికల్(3)ని దుర్వినియోగం చేస్తున్నారు'
హైదరాబాద్: ఆర్టికల్(3)ని దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్ సీప నేత మైసూరా రెడ్డి విమర్శించారు. ఈ విషయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు వెంటనే స్పందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ (3)ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారన్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్(3)ని దుర్వినియోగం చేయడం ఫెడరల్(సమాఖ్య) స్పూర్తికి విరుద్దమన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీల ముఖ్య నేతలను కలుస్తామన్నారు. అనంతరం కోర్టు అనుమతి తీసుకుని మిగిలిన పార్టీ నేతలను రాష్ట్ర రాజధానులకు వెళ్లి కలుస్తామన్నారు. -
6,7న రహదారుల దిగ్బంధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియపై ముందుకు వెళుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. విభజన అంశంపై నవంబర్ ఏడో తేదీన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) నిర్విహ ంచనున్న సమావేశాన్ని నిరసిస్తూ నవంబర్ 6, 7 తేదీల్లో 48 గంటలపాటు రహదారుల దిగ్బంధం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి మంగళవారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... విభజనకు నిరసనగా పార్టీ నిర్ణయించిన ఆందోళన కార్యక్రమాలను వివరించారు. నవంబర్ ఒకటి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న నరకాసురులను వధించాలని చెప్పారు. నరకచతుర్దశి నవంబర్ 1 వ తేదీ రాత్రి నుంచే ప్రారంభమవుతుం దని, అందువల్ల ఆ రోజు రాత్రి ఏడు గంటలకు రాష్ట్రాన్ని విభజిస్తున్న సోనియాగాంధీ, సహకరిస్తున్న టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు, నాటకాలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజనకు ఆజ్యం పోసిన కేసీఆర్ నాలుగు తలలతో దిష్టిబొమ్మను రూపొందించి దగ్ధం చేయాలని చెప్పారు. నరకునితో యుద్ధం చేసింది శ్రీకృష్ణుడే అయినా, వధించడంలో కీలక పాత్ర పోషించింది సత్యభామేనని... అందువల్ల ఈ కార్యక్రమంలో మహిళలంతా చురుగ్గా పాల్గొనాలని కోరారు. అదే రోజున ఉదయం గ్రామ సభలు నిర్వహించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి pmosb@nic.in, manmohan@sansad.nic.in ఈమెయిల్స్ ద్వారా ప్రధానమంత్రికి పంపాలని మైసూరా కోరారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తే చదవరని, వారికి ఈమెయిల్స్ పట్ల ఉన్న మోజును ఎగతాళి చేయడానికే ఈ మెయిల్స్ పంపాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. కేంద్రంలో అసలు యూపీఏ ప్రభుత్వం అనేదేలేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని విమర్శించారు. మెజారిటీకి 40 సీట్లు తక్కువగా ఉన్న బలహీనమైన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని విభజించేంత పెద్ద పని చేసే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ తన చేతిలో ఉన్న అధికారంతో అసెంబ్లీని సమావేశపర్చకుండా రాష్ట్రపతికి పెద్ద లేఖలు రాస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర సమైక్యత పట్ల చిత్తశుద్ధి ఉంటే కిరణ్ తక్షణం అసెంబ్లీని సమావేశ పర్చి సమైక్య తీర్మానం చేయాలని మైసూరా డిమాండ్ చేశారు. లగడపాటితో అశోక్‌బాబు చర్చలు: కాంగ్రెస్ ఎంపీ లగడపాటి నివాసంలో ఈ నెల 10వ తేదీన జరిగిన సమావేశంలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు పాల్గొన్నారని.. అందులోనే దత్తపుత్రుడు, కొత్త పార్టీ వంటి అంశాలపై చర్చలు జరిగాయని మైసూరారెడ్డి వెల్లడించారు. వీరి సమావేశంలో ఈ చర్చలు జరిగినట్లు తమ వద్ద పక్కా సమాచారం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌తో జగన్ కుమ్మక్కు అయ్యారని కాంగ్రెస్‌కు చెందిన లగడపాటి, జేసీ దివాకర్‌రెడ్డి, ఇతర టీడీపీ నేతలు ఒక పథకం ప్రకారం విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రాన్ని విభజించవద్దని తమ అధిష్టానాన్ని ఒప్పించలేక భంగపాటుకు గురైన కాంగ్రెస్ నేతలు జగన్‌పై పడి ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు విభజనకు లేఖ ఇచ్చి రాజకీయ ప్రతిష్టను కోల్పోయిన చంద్రబాబు కూడా దిక్కుతోచక జగన్‌పైనే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఈ రెండు పార్టీలూ కుట్రపూరితంగా కావాలనే ఇలాంటి విమర్శలు చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. -
ఉద్యమాన్ని నీరుగార్చేలా సీఎం వ్యవహరిస్తున్నారు
-
సమన్యాయం చేయండి: మైసూరారెడ్డి
-
'చంద్రబాబు తీరు రామాయణంలో పిడకల వేటలా ఉంది'
హైదరాబాద్:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరు రామాయణంలో పిడకల వేట మాదిరిగా ఉందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి విమర్శించారు. రాష్ట్రమంతా ఢిల్లీ వైపు ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే.. చంద్రబాబు అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. చట్టం, నిబంధనలు గురించి చంద్రబాబు నాయుడు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. చంద్రబాబు దిగజారి మాట్లాడటం ఇందుకు నిదర్శమని మైసూరా తెలిపారు. చంద్రబాబుకు జగన్మోహనరెడ్డి ఫోబియా పట్టుకున్న కారణంగానే ఈ రకంగా మాట్లాడుతున్నారన్నారు. విభజన అంశం ఇరు ప్రాంతాల మధ్య సున్నితమైన సమస్య అయినపుడు కేంద్రం ఆచితూచి వ్యవహరించాలన్నారు. విభజనపై నిర్ణయం తీసుకున్నాం కదా అని ముందుకెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మైసూరా హైచ్చరించారు. -
'సీఎం చేతిలో ఇప్పుడు వజ్రాయుధం ఉంది'
కడప: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో అసెంబ్లీ తీర్మానం అనే వజ్రాయుధం ఉందని వైఎస్సార్ సీపీ నేత మైసూరా రెడ్డి తెలిపారు. విభజన బిల్లు తీర్మానాన్ని అసెంబ్లీలో పెడితే ఎవరేమిటో పది నిమిషాల్లో తెలుస్తుందని మైసూరా సవాల్ విసిరారు. అసెంబ్లీ సమన్వయ పరచకుండా సీఎం డ్రామాలాడుతున్నారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో తీర్మానం వంటి వజ్రాయుధం కిరణ్ చేతిలో ఉందన్నారు. విభజన బిల్లు తేవాలంటే కారణం ఏమని చెబుతారు ?:అని మైసూరా ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి 10 సీట్లు కావాలని చెబుతారా ? అని చెబుతారా అని నిలదీశారు. సమైక్య ఉద్యమానికి వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు తెలిపారు. తండ్రిలా విభజన చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉండాలనేది వైఎస్ఆర్సిపి అభిమతం అని తెలిపారు. -
సీపీఎంతో ప్రాథమిక చర్చలు జరిపాం: మైసూరారెడ్డి
హైదరాబాద్: సమైక్యరాష్ట్ర ఉద్యమం కోసం సీపీఎంతో ప్రాథమిక చర్చలు జరిపామని వైఎస్సార్ సీపీ నేత ఎం.వి మైసూరారెడ్డి తెలిపారు. కలిసి ఉద్యమం చేద్దామనే కోణంలో చర్చ సాగిందని ఆయన అన్నారు. రాష్ట్ర ఐక్యతకోసం సీపీఎంతో చర్చలు జరిపిన అనంతరం మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో చర్చించి నిర్ణయం త్వరలో చెప్తామన్నారని మైసూరా అన్నారు. ఉద్యమంపై రెండు పార్టీల మధ్య భావసారూప్యత ఉన్నా, కలిసి ఉద్యమం చే్ద్దామనే కోణంలో చర్చించామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ చర్చల్లో పాల్గొన్న బి.వి.రాఘవులు అనంతరం మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ బృందం కలిసి పనిచేద్దామని ప్రతిపాదించిదన్నారు. ఈ విషయాన్ని పార్టీలో చర్చించి తమ నిర్ణయం చెప్తామని వారికి తెలిపినట్లు రాఘవులు తెలిపారు. -
బ్లాంక్‌చెక్ ఇచ్చినది బాబే కదా?
వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి విభజన వల్ల మూడు ప్రాంతాలకు తీరని నష్టం విభజించాలని మేమెప్పుడూ బ్లాంక్ చెక్ ఇవ్వలేదు న్యాయం చేయనందునే సమైక్యంగా ఉంచాలంటున్నాం మా విధానంపై కొన్ని పార్టీలు, ఒక వర్గం మీడియా వక్రభాష్యం చెబుతున్నాయి టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి సాక్షి, హైదరాబాద్: ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రాన్ని విభజించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసిన మాట వాస్తవం కాదా? రాష్ట్రాన్ని విభజించాలంటూ బ్లాంక్చెక్లాంటి లేఖ ఇవ్వలేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ప్రశ్నించారు. తమ పార్టీని విమర్శించేముందు టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ ఎవరు బ్లాంక్‌చెక్ ఇచ్చారో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అందజేసిన లేఖలను పరిశీలించాలని వారికి సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... షిండే నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్షంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరిని తెలియజేస్తూ ఇచ్చిన లేఖలను విడుదల చేశారు. ఎవరికీ అన్యాయం జరగకుండా, ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా తమ పార్టీ కోరిందన్నారు. రాష్ట్ర విభజనకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని టీడీపీ లేఖ ఇచ్చిందని చెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం రాష్ట్ర విభజన జరిగితే దానివల్ల మూడు ప్రాంతాలకు అన్ని విధాలా తీరని నష్టం వాటిల్లనుందని, అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. అంతేకాదు విభజన వల్ల తలెత్తే అంశాలను వివరిస్తూ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రధానికి లేఖ కూడా రాసిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే కొన్ని ముఖం చెల్లని రాజకీయ పార్టీలు, వాటికి బాకా కొట్టే పత్రికలు, చానళ్లు తమ పార్టీ విధానాన్ని చిలువలు పలువలు చేస్తూ వక్రీకరిస్తున్నాయని దుయ్యబట్టారు. నిద్రపోయే వారిని లేపవచ్చు. కానీ నిద్రలో ఉన్నట్లు నటించేవారిని ఏం చేయగలమని ఎద్దేవాచేశారు. కేంద్రానిది ఒంటెత్తు పోకడే... సీడబ్ల్యూసీ జూలై 30న చేసిన తీర్మానానికి అనుగుణంగా కేంద్ర మంత్రివర్గ తీర్మానం కోసం హోంశాఖ సమర్పించాల్సిన నివేదికను సిద్ధం చేస్తున్నట్లు షిండే ప్రకటించడాన్ని మైసూరా తప్పుబట్టారు. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలకు ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి వారి పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చి విధానాన్ని మార్పు చేయించాలని సూచించారు. ‘‘ప్రస్తుత విభజనవల్ల నదీజలాల విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. మిగులు జలాలపై ఆధారపడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్ఎల్బీసీ, భీమా వంటి ప్రాజెక్టులకు సమస్యలు తప్పవు. అదే విధంగా రాయలసీమలోని హంద్రీనీవా, గాలేరు-నగరి, ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారవుతోంది’’ అని మరోసారి గుర్తుచేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఇవేవీ పట్టించుకోకుండా చేస్తున్న అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తూ.. తమ పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు స్పీకర్ ఫార్మట్‌లోనే రాజీనామా చేశారని తెలిపారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిలు ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టినా కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా ఒంటెత్తుపోకడలు అవలంబిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు ప్రజలను గందరగోళానికి గురిచేయకుండా వారి పదవులకు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలను మీడియా ప్రస్తావించగా... ‘పచ్చ కామెర్లు వచ్చిన రోగికి లోకమంతా పచ్చగా కనబడుతోందన్నట్లు... రాత్రివేళ చిదంబరంతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నది ఎవరు? కేసులు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో కాపాడిన ఘనత ఆయనది కాదా? ’ అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ లేఖ సారాంశం ‘ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా, ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాం.’ టీడీపీ లేఖ సారాంశం ‘రాష్ట్ర విభజనకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం.’ -
సోనియా.. నోరెలా వచ్చింది?
పదేళ్లుండి వెళ్లిపొమ్మంటావా: మైసూరారెడ్డి ‘‘దేశంలోని ఇతర మహా నగరాలకు హైదరాబాద్ దీటుగా, తలమానికంగా నిలవాలన్న ఆకాంక్షతో మూడు ప్రాంతాల వారూ దాన్ని మహానగరంగా తీర్చిదిద్దారు. అలాంటి నగరంలో తాత్కాలికంగా పదేళ్లుండి తర్వాత వెళ్లిపొండని చెప్పడానికి నోరెలా వచ్చింది?’’ అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎం.వి.మైసూరారెడ్డి మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ కష్టించి నిర్మించిన హైదరాబాద్ నేడు దేశంలోని ఏ మహా నగరానికీ తీసిపోదని, అలాంటి నగరాన్ని వేరొకరికి ఇచ్చేస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘యాభై ఏళ్లుగా అందరూ కష్టించి అభివృద్ధి చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌ను చీల్చాలని కేవలం ఒక్క సోనియానే అనుకున్నారు. ఏమ్మా! అది నీ ఆస్తా? నీ సొంతమా? నీ సొంత జాగీరా? నీకు 33మంది ఎంపీలను ఇచ్చి, యూపీఏ సర్కారును రాష్ట్ర ప్రజానీకం నిలబడెతే నువ్వు చేసిన ఘనకార్యం, నువ్వు చేసిన మెహర్బానీ రాష్ట్రాన్ని చీల్చడమేనా?’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘మీ సొత్తో, మీ బాబు సొత్తు కాదు కదా! విభజించడానికైతేనేం, తుంచడానికైతేనేం...! మీ సొత్తయితే, ఇటలీ నుంచి తీసుకొచ్చిందైతే, మీరు నిర్మించిందైతే మీ బుద్ధి ప్రకారం పంచండి. మేమెవరమూ అడగం. కానీ ఇది ప్రజల సొత్తు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలే తప్ప మీ కుమారుడికి పది సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒప్పుకోరు’’ అని సోనియాకు తేల్చిచెప్పారు. ‘‘పాపం సోనియా పుత్ర రత్నానికి ఆంధ్రప్రదేశ్లోపది సీట్లు కావాలట! ఏం, ఆ పది సీట్లను మీరు ముష్టెత్తుకుంటే ఇచ్చేవాళ్లం కదా! ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఇంత క్షోభ పెట్టడం దేనికి?’’ అంటూ ధ్వజమెత్తారు. ఢిల్లీలో బుధవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన ధర్నాలో మైసూరా ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలను, ప్రధానిని, కేంద్ర మంత్రులను, చంద్రబాబును, టీడీపీ నేతలను వాగ్బాణాలతో, వ్యంగ్యాస్త్రాలతో తూర్పారబట్టారు. వెలకట్టి కొనేదా సమైక్యం? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మైసూరా నిప్పులు చెరిగారు. ‘‘తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి ఆయన. అలాంటిది, విభజనపై కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించాక అది పార్టీ నిర్ణయమా, ప్రభుత్వ నిర్ణయమా అనే తేడా కూడా తెలియకుండా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడారు. రూ.4 లక్షల కోట్లిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారట! వెలకట్టి, విలువ కట్టి కొనగలిగేదా సమైక్యమనేది, రాజధాని అనేది, నీళ్ల సమస్య అనేది? పైగా ఏపీఎన్జీవోల సంఘం వారు వెళ్లి మద్దతు కోరితే, తాను ఉత్తరమిచ్చానని, వెనక్కి తీసుకోలేనని బాబు చెప్పారు. ప్రజల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని మాట్లాడాలే తప్ప, ‘నేనేదో ఒక ఉత్తరం ఇచ్చాను, దానికి కట్టుబడి ఉంటా’నని చెప్పడమేమిటి? మీరు కట్టుబడి ఉంటే మీ పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారు? నికృష్టంగా, పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కేలా, అంతా ఈసడించుకునేలా, అసహ్యించుకునేలా పార్లమెంటులో మాత్రం ధర్నాలు చేశారు. నిసిగ్గుగా సస్పెండ్ చేయించుకున్నారు. అయినా సిగ్గు లేదు. నిజానికి ఇంత చేయాల్సిన ఖర్మ పట్టలేదు. ఆ రోజు బుద్ధి లేక ఇచ్చానంటూ ముక్కుచెంపలు వేసుకుని, ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం ఉత్తరాన్ని వెనక్కు తీసుకో. ప్రజానీకమంతా సంతోషిస్తారు’’ అని బాబుకు హితవు పలికారు. ‘‘కానీ బాబు అది చేయరట. బెల్లంకొట్టిన రాయిలా ఇంట్లోనే ఉంటారట. అందరూ వీధుల్లో పడాలట. అరవాలట. ఇదేం పద్ధతయ్యా? ఓ పార్టీకి అధ్యక్షుడివి, రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన వ్యక్తివి... ఇదేనా నీకుండాల్సిన బుద్ధి?’’ అంటూ కడిగి పారేశారు. ధృతరాష్ట్రుడినీ మించిన ప్రధాని సోనియా చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఆర్థికమంత్రి చిదంబరం నడక ఎలా ఉంటుందో మైసూరా హావభావసహితంగా చూపించారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన చిదంబరం నిర్వాకం వల్లే డాలర్ రేటు 67 రూపాయలు అయ్యిందన్నారు.‘‘సాయంత్రానికి అది 68 అవుతుందేమో! ఎందుకంటే చిదంబరం వయసు 68 ఏళ్లట’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘మరొకాయన ఉన్నారు. మన ప్రధాని. ఆయనకన్నా ధృతరాష్ట్రుడన్నా నయమేమో. ధృతరాష్ట్రునికి కళ్లు కనిపించవు గానీ చెవులు బాగా వినిపిస్తాయి. కానీ ప్రధానికి చెవులు వినపడవు. కళ్లు కనపడవు. ఆయన వయసు 75 ఏళ్లు. కాబట్టి పెట్రోలు ధరను రూ.75కు తీసుకెళ్లాడు. డాలర్‌ను కూడా 75 రూపాయలు చేసేదాకా ఆయన శాంతించేట్టు లేరు. రెండింటి ధరా రూ.100 చేస్తే బాగుంటుందని ఎవరో అన్నారట. కానీ ప్రధాని మాత్రం, ‘అబ్బబ్బే... నాకంత టైం లేదు. టైముంటే చేసి ఉండేవాడిని. నాకు 75 ఏళ్లు. పదవి మరో ఆరు నెలలే ఉంది’ అన్నారట’’ అంటూ వ్యంగ్య బాణాలతో అలరించారు. అందరికీ సమస్యలు చెప్పాం... రాజధాని సమస్య, నీటి సమస్యలు, ఇతర సమస్యలపై జగన్ తరఫున, పార్టీ తరఫున రాష్ట్రపతి, ప్రధానితో పాటు దేశంలోని పలు పార్టీలను కలిశామని మైసూరా గుర్తు చేశారు. అసోం గణ పరిషత్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, బీజేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, బీజేపీ, ఏఐడీఎంకే నాయకులకు అన్నీ వివరించాం. అందరూ ఒక్కటే మాట అంటున్నారు. ఇది తప్పుడు నిర్ణయమని చెబుతున్నారు. ప్రజలందరి మనోభావాలను తెలుసుకోకుండా నిర్ణయం తీసుకున్నారంటూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ నిర్ణయంపై ఒకసారి పునరాలోచన చేయండి’’ అని ఆయన కేంద్రం పెద్దలను కోరారు. నదీ జలాలను పంచడం అంత సులభం కాదని, పంచాలంటే సోనియాకు చేతకాదని అన్నారు. ఉద్యోగ, కుల, ప్రజా సంఘాల మద్దతు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో జరిగిన ధర్నాకు ఏపీఎన్జీవోతోపాటు యువజన, విద్యార్థి జేఏసీ, జాతీయ దళిత హక్కుల సంఘం, స్థానిక తెలుగు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ... సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా కాంగ్రెస్‌కు చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. సీమాంధ్ర పోరాటానికి మద్దతు తెలిపే పార్టీల వెంట తాము ఉంటామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని దళిత హక్కుల సంఘం జాతీయ సమన్వయ కర్త ఆనందరావు డిమాండ్ చేశారు. సమన్యాయం పాటించాలని దీక్ష చేపట్టిన పార్టీ ఒక్క వైఎస్సార్సీపీయే అన్నారు. మరోవైపు సామాజిక తెలంగాణ జేఏసీ నేతలు దేవని సతీష్‌కుమార్, గాలి వినోద్‌కుమార్ విజయమ్మను కలిసి వినతి పత్రాన్ని అందచేశారు. -
'నాలుగైదు లక్షల కోట్లు అడిగిన ఘనత బాబుది'
న్యూఢిల్లీ : ప్రజల మనోభావాలు గుర్తించకుండా నాలుగైదు లక్షల కోట్లు కావాలని అడిగిన చరిత్ర చంద్రబాబునాయుడుదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకమండలి సభ్యుడు మైసురారెడ్డి మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మైసూరారెడ్డి.... చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్త రాజధాని ఏర్పాటు కోసం బాబు నాలుగైదు లక్షల కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కు తీసుకుంటే సమైక్య రాష్ట్రం సాకారమవుతుందని మైసూరా అన్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తాము పోరాడుతుంటే చంద్రబాబు ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దశాబ్దాల పాటు చెమట చుక్కలు చిందించి నిర్మించికున్న రాష్ట్రాన్ని ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘనత సోనియాదేనని మైసూరరెడ్డి విమర్శించారు. విభజనకు ముందు వేయాల్సిన మంత్రులు కమిటీని ఇప్పుడు వేయడమేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ మాత్రం కృషి చేయని టీడీపీ.... కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసేందుకు మాత్రం ముందుంటోందని మైసూరారెడ్డి విమర్శించారు. -
'నాలుగైదు లక్షల కోట్లు అడిగిన ఘనత బాబుది'
న్యూఢిల్లీ : ప్రజల మనోభావాలు గుర్తించకుండా నాలుగైదు లక్షల కోట్లు కావాలని అడిగిన చరిత్ర చంద్రబాబునాయుడుదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకమండలి సభ్యుడు మైసురారెడ్డి మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మైసూరారెడ్డి.... చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్త రాజధాని ఏర్పాటు కోసం బాబు నాలుగైదు లక్షల కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కు తీసుకుంటే సమైక్య రాష్ట్రం సాకారమవుతుందని మైసూరా అన్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తాము పోరాడుతుంటే చంద్రబాబు ఇంట్లో కాలక్షేపం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దశాబ్దాల పాటు చెమట చుక్కలు చిందించి నిర్మించికున్న రాష్ట్రాన్ని ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘనత సోనియాదేనని మైసూరరెడ్డి విమర్శించారు. విభజనకు ముందు వేయాల్సిన మంత్రులు కమిటీని ఇప్పుడు వేయడమేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ మాత్రం కృషి చేయని టీడీపీ.... కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసేందుకు మాత్రం ముందుంటోందని మైసూరారెడ్డి విమర్శించారు. -
దిగ్విజయ్ సింగ్‌కు మతిభ్రమించింది: మైసూరా
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చిందన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఆ పార్టీ బుధవారం ఖండించింది. బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి మాట్లాడుతూ... దిగ్విజయ్ సింగ్ మాటలు పూర్తిగా అసత్యమని ఆయన పేర్కొన్నారు. ఓ వేళ రాష్ట్ర విభజన జరిగితే ఇరు ప్రాంతాల్లోని అన్ని అంశాలను పరిగణలో తీసుకోవాలని, అలాగే అందరికి సమన్యాయం చేయాలని గతంలో దిగ్విజయ్ సింగ్‌ను కలసినప్పుడు సూచించామని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజనపై ఓ తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని దిగ్విజయ్ సింగ్‌కు చెప్పామన్నారు. ఆల్‌పార్టీ మీటింగ్‌లో తాము చెప్పిన విషయాలను షిండే పక్కనపెట్టారని మైసూరారెడ్డి ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓ సీనియర్ రాజకీయ నాయకుడు ఈ విధంగా మాట్లాడటం దౌర్బాగ్యమని మైసూరారెడ్డి పేర్కొన్నారు. -
దిగ్విజయ్ సింగ్‌కు మతిభ్రమించింది: మైసూరా