హైదరాబాద్:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరు రామాయణంలో పిడకల వేట మాదిరిగా ఉందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి విమర్శించారు. రాష్ట్రమంతా ఢిల్లీ వైపు ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే.. చంద్రబాబు అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. చట్టం, నిబంధనలు గురించి చంద్రబాబు నాయుడు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. చంద్రబాబు దిగజారి మాట్లాడటం ఇందుకు నిదర్శమని మైసూరా తెలిపారు. చంద్రబాబుకు జగన్మోహనరెడ్డి ఫోబియా పట్టుకున్న కారణంగానే ఈ రకంగా మాట్లాడుతున్నారన్నారు.
విభజన అంశం ఇరు ప్రాంతాల మధ్య సున్నితమైన సమస్య అయినపుడు కేంద్రం ఆచితూచి వ్యవహరించాలన్నారు. విభజనపై నిర్ణయం తీసుకున్నాం కదా అని ముందుకెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మైసూరా హైచ్చరించారు.