
టీడీపీ పనులు అనైతికం
హైదరాబాద్: ఒక పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులను టీడీపీ చేర్చుకోవడం దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంవీ మైసూరా రెడ్డి విమర్శించారు. టీడీపీ చేస్తున్న పనులు నైతిక విలువలకు విరుద్ధమని అన్నారు.
టీడీపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వారిని తమ పార్టీలోకి చేర్చుకోవడం దురదృష్టకరమని అన్నారు. పార్టీ వీడే వారందరికీ విప్ వర్తిస్తుంది మైసూరా రెడ్డి చెప్పారు. ఒకరిద్దరూ వెళ్లిపోయారని, ఇక ఎవరూ పార్టీని వీడరని స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం చూపిస్తున్నాయని మైసూరా రెడ్డి విమర్శించారు.