'ప్రజలు తిరుగుబాటు చేస్తారని మీకు భయమా?'
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం కోసం టీడీపీ నేతలు నైతిక విలువలు దిగజారి వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మైసూరా రెడ్డి, అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసే విప్ నూటికి నూరుశాతం చెల్లుతుందని అంబటి అన్నారు.
టీడీపీ నేతలు నిస్సిగ్గుగా బరితెగించి వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకిచ్చిన వాగ్దానాలను ముందు అమలుచేయాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అంబటి హితవు పలికారు.
హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న భయం మిమ్మల్ని వెంటాడుతోందా అని అంబటి ప్రశ్నించారు. ఫిరాయింపులు ప్రోత్సహించడం మానుకోకుంటే ప్రజలే తగిన బుద్ధిచెప్తారని మీడియాలో సమావేశంలో వైఎస్ఆర్ సీపీ నేతలు మైసూరా రెడ్డి, అంబటి రాంబాబులు హెచ్చరించారు.