ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవంబర్ ఒకటో తేదీనే నిర్వహించనుంది.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవంబర్ ఒకటో తేదీనే నిర్వహించనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు.. జిల్లా కార్యాలయాల్లో కూడా నవంబర్ ఒకటో తేదీనే రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది తప్ప.. తెలంగాణ నుంచి ఏపీ విడిపోలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర అవతరణ వేడుకలను జూన్ రెండో తేదీ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఆయన చెప్పారు. గతంలో ఏర్పడిన రాష్ట్రాలు పాటిస్తున్న సంప్రదాయాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.