ప్రభుత్వ భూములున్న చోటే రాజధాని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలవారికి ఆమోదయోగ్యంగా ఉండేలా రాజధానిని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎంవీ మైసూరా రెడ్డి అన్నారు. రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీని పాలకులు ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
శివరామకృష్ణన్ కమిటీ ఉండగానే చంద్రబాబు సలహా కమిటీని ఏర్పాటు చేయడం వెనుక అంతర్యమేమిటని మైసూరా రెడ్డి ప్రశ్నించారు. సలహా కమిటీలో ఉన్నవారు సాంకేతిక నిపుణులా అని నిలదీశారు. ప్రభుత్వ భూమి ఉన్న చోట రాజధాని ఏర్పాటు చేయాలని సూచించారు. మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాలని చెప్పారు. ప్రైవేటు భూములు ఉన్న చోట సింగపూర్, జయపుత్ర తరహా రాజధానిని నిర్మించడం కష్టమని మైసూరా రెడ్డి పేర్కొన్నారు.